Health tips | తరచూ కడుపుబ్బరం వేధిస్తున్నదా.. మీ వంటల్లో ఇది తప్పక ఉండాల్సిందే..!

Health tips : ఇంగువ అనేదిఇ ఒక ఘాటైన సుగంధ ద్రవ్యం..! పొడిగాగానీ, ముద్దగాగానీ రెండు ర‌కాలుగా ఇది ల‌భ్యమ‌వుతుంది..! ఇంగువతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..! ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది వంటలకు మంచి సువాసనను కూడా ఇస్తుంది. ప‌ప్పు, ప‌ప్పుచారు, పులిహోర‌తోపాటు వివిధ ర‌కాల‌ నిలువ తొక్కుల్లో కూడా ఇంగువ‌ను వాడుతారు. ఇంగువ‌ను వాడ‌టంవ‌ల్ల ఆహారం చెడిపోకుండా ఉంటుంది. ఇవేగాక ఇంగువతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Publish Date - May 24, 2024 / 05:02 PM IST

Health tips : ఇంగువ అనేదిఇ ఒక ఘాటైన సుగంధ ద్రవ్యం..! పొడిగాగానీ, ముద్దగాగానీ రెండు ర‌కాలుగా ఇది ల‌భ్యమ‌వుతుంది..! ఇంగువతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..! ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది వంటలకు మంచి సువాసనను కూడా ఇస్తుంది. ప‌ప్పు, ప‌ప్పుచారు, పులిహోర‌తోపాటు వివిధ ర‌కాల‌ నిలువ తొక్కుల్లో కూడా ఇంగువ‌ను వాడుతారు. ఇంగువ‌ను వాడ‌టంవ‌ల్ల ఆహారం చెడిపోకుండా ఉంటుంది. ఇవేగాక ఇంగువతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు..

1. ఇంగువ‌ను క్రమం త‌ప్పకుండా తీసుకోవ‌డంవ‌ల్ల క‌డుపు ఉబ్బరం త‌గ్గుతుంది.

2. ఇంగువ పొడిలో యాంటీ బ‌యాటిక్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాస స‌మ‌స్యల‌ పరిష్కారానికి తోడ్పడుతాయి.

3. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి కూడా ఇంగువ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకోసం మ‌హిళ‌లు బెల్లంలో బ‌ఠానీ గింజంత ఇంగువ పెట్టుకుని తినాలి.

4. తరచూ తలనొప్పితో బాధపడేవాళ్లు ఒక కప్పు మ‌రిగించిన నీళ్లలో చిటికెడు ఇంగువ వేసి రోజుకు రెండు మూడుసార్లు తాగితే తలనొప్పి మాయ‌మ‌వుతుంది.

5. పిల్లల‌కు క‌డుపులో నులి పురుగులు ఉంటే సెన‌గ గింజంత ఇంగువ‌ను వాము, బెల్లంతో క‌లిపి తినిపించాలి. మంచి ప్రయోజ‌నం ఉంటుంది.

6. రోజూ భోజ‌నం చేసేట‌ప్పుడు మొద‌టి ముద్దను నెయ్యి, వాము, ఇంగువ‌ను క‌లిపి తీసుకుంటే అజీర్తి స‌మ‌స్యలు తీరిపోతాయి.

గమనిక : అయితే ఇంగువ‌ను ప‌రిమితంగా వాడితేనే ప్రయోజ‌నకారిలా పనిచేస్తుంది. అతిగా తీసుకుంటే విరేచ‌నాలు అయ్యే ప్రమాదం ఉంటుంది.

Latest News