భ‌యం వ‌ద్దు.. నేతితో లాభాలే!

విధాత: దాదాపు అందరికీ కమ్మటి నేతి వాసన అంటే ఇష్టమే. చపాతిని నెయ్యి వేసి చేస్తే భలే రుచిగా ఉంటుంది. కానీ ఇలాంటి రోటీ ఎంజాయ్ చెయ్యడానికి మనలో చాలా మంది ఆలోచిస్తుంటారు. నెయ్యి వైపు భ‌యంగా చూస్తుంటారు. కార‌ణం కొలెస్ట్రాల్ పెగురుగుంద‌ని, లావు అవుతామ‌ని భ‌యం. కానీ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పదేపదే నొక్కి చెబుతున్నారు. వారు చెబుతున్నదేమిటో ఒకసారి చూద్దాం. నార్త్‌లో ఎక్కువ‌.. కొన్ని వంటల్లో నెయ్యి వాడడం వల్ల వాటి […]

  • Publish Date - November 18, 2022 / 09:45 AM IST

విధాత: దాదాపు అందరికీ కమ్మటి నేతి వాసన అంటే ఇష్టమే. చపాతిని నెయ్యి వేసి చేస్తే భలే రుచిగా ఉంటుంది. కానీ ఇలాంటి రోటీ ఎంజాయ్ చెయ్యడానికి మనలో చాలా మంది ఆలోచిస్తుంటారు. నెయ్యి వైపు భ‌యంగా చూస్తుంటారు. కార‌ణం కొలెస్ట్రాల్ పెగురుగుంద‌ని, లావు అవుతామ‌ని భ‌యం. కానీ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పదేపదే నొక్కి చెబుతున్నారు. వారు చెబుతున్నదేమిటో ఒకసారి చూద్దాం.

నార్త్‌లో ఎక్కువ‌..

కొన్ని వంటల్లో నెయ్యి వాడడం వల్ల వాటి రుచి పెరుగుతుందంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. అంతే కాదు నేతితో చేసిన చపాతిలు చాలా సమయం పాటు మృదువుగా ఉంటాయి. నేతితో కాల్చిన చపాతిల‌ను ఇష్టపడే వారే ఎక్కువ. ‘‘కొన్ని ఇళ్లలో చపాతి అంటేనే నేతితో కాల్చే సంప్ర‌దాయం ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ కుటుంబాల్లో ఇది ఎక్కువ. అయితే కొంత మంది లావు అవుతామనో, కొలెస్ట్రాల్ అనో భయపడుతుంటారు. కానీ ఒక మోతాదులో తీసుకునే నెయ్యి ఆరోగ్యం విషయంలో వండర్స్ చేస్తుంది.’’ అని ఢిల్లీకి చెందిన న్యూట్రిసనిస్ట్ ఆంచల్ సోగనీ తెలిపారు. బరువు తగ్గాలన్న ఆలోచనలో ఉన్న ప్రతీ వారు నెయ్యిని అవాయిడ్ చేస్తుంటారు. అలా పూర్తిగా నెయ్యి వాడకం మానకూడదనేదే నిపుణుల సూచన.


గ్లైసిమిక్ ఇంటెక్స్‌లో మార్పులు

చపాతితో లేదా అన్నంతో నెయ్యిని వాడితే వాటి గ్లైసిమిక్ ఇంటెక్స్ పడిపోతుందని కూడా అంటున్నారు. జీఐ (గ్లైసిమిక్ ఇంటెక్స్)గా వ్యవహరించే ఈ సూచికను ఆహారంలో కార్బోహైడ్రేట్‌ స్థాయిని తెలిపేందుకు ఉపయోగిస్తారు. ఈ సూచిక ఆధారంగానే మనం తీసుకున్న ఆహారం ఎంత త్వరగా గ్లూకోజ్ గా మారి రక్తంలో చేరుతుందో అంచనా వేస్తారు.

నేతితో క‌ణ‌జాలాల‌కు ఆరోగ్యం

నెయ్యి తినడం వల్ల కడుపు నిండుగా ఉండి రోజులో ఆ తర్వాత తీసుకునే ఆహారం క్వాంటటీ తగ్గుతుంది. నెయ్యిలో కొవ్వును క‌రిగించే విటమిన్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగ పడతాయి. హార్మోన్లను సమతుల్యం చెయ్యడంలో కూడా నెయ్యి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తద్వారా కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. నెయ్యికి హీటింగ్ పాయింట్ ఎక్కువ అందువల్ల దీన్ని వేడి చేసినపుడు ఫ్రీ రాడికల్స్ త్వరగా విడుదల కావు. ప్రీరాడికల్స్ కణజాలాల ఆరోగ్యం కాపాడ‌డానికి తోడ్ప‌డుతాయి.

విట‌మిన్లు గ్ర‌హించేందుకు దోహ‌దం

నెయ్యిని వంటలో వాడడం, రోటిలో, అన్నంలో, పప్పులో వాడడం తప్పనిసరి చేయాలి. నెయ్యిలో ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరం విటమిన్ డి, ఏ, ఈ ని గ్రహించేందుకు దోహదం చేస్తాయి. అంతేకాదు వంటను రుచిగా మారుస్తాయని సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుచితా దివాకర్ అన్నారు.

నెయ్యితో న‌ష్టం లేదు..

హై స్మోకింగ్ పాయింట్ వల్ల నేతిని వంటల్లో ఉపయోగిస్తే పప్పులు, కొన్నిరకాల స్వీట్లకు మంచి ప్లేవర్ వ‌స్తుంది. అంతేకాదు పెద్ద ఖరీదు కూడా కాదు. క్యాలరీలు ఎక్కువ అని నెయ్యిని పక్కన పెడుతుంటాం. అది నిజమే కానీ, వంటల్లో వాడే ఇతర నూనెల కంటే తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయ‌నేది వాస్తవం. కాబట్టి రోజువారీ వాడకంలో నెయ్యిని చేర్చుకోవడం వల్ల వచ్చే ప్రత్యేక నష్టమేమీ లేదనేది నిపుణుల సలహా. అంతే కాదు ఇది లాక్టోజ్ ఫ్రీ కనుక లాక్టోజ్ ఇన్ టాలెరన్స్ సమస్య ఉన్న వారికి బాగా సుటయ్యే పాల పదార్థం కూడా.

సో.. ఇక‌నైనా నెయ్యిని ఆహారంలో చేర్చడానికి ఆలోచించ‌కుండా లాగించేయండి. అయితే పరిమితి మాత్రం మరచిపోవద్దు. ఒక చిన్న స్పూన్ నెయ్యి వాడడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు.

Latest News