Health Tips | బాడీ పెయిన్స్‌.. ఇన్‌ఫెక్షన్స్‌.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!

  • Publish Date - March 18, 2024 / 05:19 AM IST

Health Tips : ప‌సుపు..! మాన‌వ జీవ‌న విధానంలో ప‌సుపున‌కు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. పసుపు ప్రాముఖ్యం గురించి పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. వివిధ ఆరోగ్య సమస్యల ప‌రిష్కారానికి ప‌సుపు సహజ‌ ఔషధంలా ప‌నిచేస్తుంది. చిన్నచిన్న గాయాలైనప్పుడు ఆ గాయంపై చిటికెడు పసుపు వేస్తే సెప్టిక్‌ కాకుండా ఉంటుంది. గాయం త్వరగా మానిపోతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వ‌చ్చే సీజ‌న‌ల్ స‌మ‌స్యలకు ప‌సుపు చ‌క్కని ప‌రిష్కారం చూపుతుంది.


పసుపుతో ప్రయోజనాలు..

1. పసుపులో కర్కుమిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా, యాంటీ ఇన్‌ఫ్లామెట‌రీగా ప‌నిచేస్తుంది. ఈ కారకాలు మన శరీరంలో నొప్పి నివార‌ణిలుగా ప‌నిచేస్తాయి.

2. పసుపు యాంటీ సెప్టిక్‌గా ప‌నిచేస్తుంది. ఎక్కువ శీతాకాలంలో వేధించే జలుబు, ఫ్లూ వంటి సీజ‌న‌ల్ వ్యాధుల నివారణ‌లో మంచి ప్రయోజ‌న‌కారిగా ఉంటుంది.

3. పసుపున‌కు వేడిని ఉత్పత్తి చేసే ల‌క్షణం ఉంటుంది. ఈ ల‌క్షణం క‌ణాల ప‌నితీరును స‌క్రమంగా ఉంచుతుంది. వ్యాధినిరోధ‌క శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది.

4. కీళ్ల నొప్పులకు కూడా పసుపు ఔషధంలా పనిచేస్తుంది. టీ లేదా పాలలో ఒక చిటికెడు పసుపు వేసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి త‌క్షణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

5. పసుపులోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు విషాలను విచ్ఛిన్నం చేసే గుణం క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల ప‌సుపు కాలేయాన్ని విష‌ర‌హితం చేయ‌డంలో తోడ్పడుతుంది.

Latest News