Azharuddin Likely To Get Minister Post | అజారుద్ధీన్ కు హోంశాఖ ?

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో అజారుద్దీన్‌కు హోంశాఖ కేటాయిస్తారా? కొత్త మంత్రిత్వ విభజనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.

Azharuddin

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ మహ్మద్ అజారుద్ధీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. రాజ్ భవన్ లో రేపు శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకుంటున్న అజారుద్ధీన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఏ మంత్రిత్వ శాఖ కట్టబెట్టబోతున్నారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన(జీఏడీ), హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, కమర్షియల్ టాక్సెస్, విద్యాశాఖ, న్యాయశాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలు ఉన్నాయి. ఇన్నాళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోం శాఖను అజారుద్దీన్‌కు ఇవ్వనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ అజారుద్ధీన్ కు హోంశాఖ అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లుగా రాజకీయ వర్గాల బోగట్టా.

తెలంగాణ ఏర్పాటు పిదప హైదరాబాద్ నగరానికే చెందిన మైనార్టీ నేత..అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి హోదాతోపాటు కీలకమైన రెవెన్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అర్బన్‌ల్యాండ్ సీలింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు కేటాయించారు. కేసీఆర్ రెండో మంత్రివర్గంలోనూ మహమూద్ అలీకి తెలంగాణ హోంశాఖ, జైళ్లు, అగ్నిమాపక శాఖలు కేటాయించడం గమనార్హం.

ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గం – వారి వద్ద ఉన్న శాఖలు

రేవంత్ రెడ్డి (ముఖ్యమంత్రి) – జీఏడీ, హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, కమర్షియల్ టాక్సెస్, విద్యా, లా, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్

భట్టి విక్రమార్క మల్లు (డిప్యూటీ సీఎం)- ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, విద్యుత్
ఉత్తమ్ కుమార్ రెడ్డి – పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు – ఐటీ – ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రెవెన్యూ, హౌసింగ్, ఐ అండ్ పీఆర్
తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం- మార్కెటింగ్, చేనేత
పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమం
కొండా సురేఖ- అటవీ – పర్యావరణ, దేవాదాయశాఖ
అనసూయ సీతక్క- పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, మహిళా శిశు సంక్షేమం
జూపల్లి కృష్ణారావు- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్, ఆర్కియాలజీ
దామోదర రాజనర్సింహ్మ- వైద్యారోగ్య – కుంటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ
వివేక్‌ వెంకటస్వామి – గనులు, కార్మిక- ఉపాధి శిక్షణ- ఫ్యాక్టరీస్‌
వాకిటి శ్రీహరి – పశుసంవర్ధక- పాడి పరిశ్రమాభివృద్ధి- మత్స్య శాఖలు, క్రీడలు, యువజన సర్వీసులు
అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ – ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమం.