విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ నెల 23నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ ద్వారా జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల వాహనదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణ రవాణా శాఖ తమ సొంత ఐటీ వ్యవస్థ ద్వారా వాహనదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ తో అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలోని వాహనాల వివరాలు జాతీయ డేటాబేస్ లోకి వెళ్తాయి. దీనివల్ల వాహనాలకు సంబంధించిన అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వస్తాయి.
డిజిటల్ విధానం వల్ల పారదర్శకత పెరిగి ఆర్టీఏ కార్యకలాపాల్లో దళారుల ప్రమేయం తగ్గుతుంది. వాహన యజమాని చిరునామా, పేరు మార్పు.. వాహనం ఆర్సీ డూప్లీకేట్ కాపీ, వాహనం తాకట్టు ఎంట్రీ, తొలగింపు వంటి సేవలు ఇక ఆన్‌లైన్‌లోకి వస్తాయి. ఆర్టీ ఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లో వాహనాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవచ్చు.
రెండవ వాహనం కొనుగోలుపై అదనపు లైఫ్ టాక్స్ రద్దు
కేంద్ర ప్రభుత్వ అనుసంధాన వాహన పోర్టల్ ద్వారా రెండవ వాహనం కొనుగోలుపై అదనంగా విధించే 2 శాతం లైఫ్ టాక్స్ ను కూడా రద్దు చేస్తున్నారు. జాతీయ పోర్టల్ తో అనుసంధానంతో లభించనున్న ఈ ప్రయోజనం మధ్యతరగతి వాహనదారులకు భారీ ఆర్థిక ఊరటను ఇస్తుంది. 10 లక్షల విలువైన కారును కొనుగోలు చేస్తే వారికి 20,000 రూపాయల వరకు ఆదా కానుండటం గమనార్హం. ఈ అదనపు పన్నును తొలగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కొద్దివారాల క్రితమే అనుమతి ఇచ్చారుఅలాగే వివిధ రాష్ట్రాల్లో వాహన తనిఖీలు జరిగినప్పుడు లేదా వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించినప్పుడు డాక్యుమెంటేషన్ ప్రక్రియ సులభతరం కానుంది.
కొత్త వాహన రిజిస్ట్రేషన్, ఆర్‌సీ రెన్యూవల్, చిరునామా మార్పు.వాణిజ్య వాహనాలకు పర్మిట్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ మంజూరు, వాహనాన్ని ఒకరి పేరు నుండి మరొకరి పేరుకు మార్చడం వంటి సేవలు అన్ని వాహన్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. వాహన పన్ను , ఇతర ఫీజులు,ఇ-చలాన్ జరిమానాలను ఆన్‌లైన్‌లో చెల్లించడం, వాహన రుణం(హైపోథెకేషన్) ముగిసిన తర్వాత బ్యాంక్ వివరాలను తొలగించడం వంటిని అన్ని వాహన్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు .
ఇవి కూడా చదవండి :
పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలి: కోమటిరెడ్డి
Lizard | పొద్దున్నే బల్లిని చూస్తే.. శుభమా..? అశుభమా..?
