ఆర్టీసీ కార్మికులకు 2.1శాతం డీఏ పెంపు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డీఏను 2.1 శాతం(కరువు భత్యం) పెంచుతున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ పెంపు ఈ ఏడాది 2026జనవరి 1నుంచే వర్తించనున్నట్లుగా వెల్లడించారు.

ఆర్టీసీ కార్మికులకు 2.1శాతం డీఏ పెంపు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డీఏను 2.1 శాతం(కరువు భత్యం) పెంచుతున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ పెంపు ఈ ఏడాది 2026జనవరి 1నుంచే వర్తించనున్నట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటనతో ప్రస్తుతం 50.7 శాతం ఉన్న డీఏ.. 52.8 శాతానికి పెగరనుంది.

నిర్ణయంతో ఆర్టీసీలో పెండింగ్‌లో ఉన్న డీఏల ప్రక్రియ పూర్తిగా క్లియర్ చేసినట్లయ్యింది. డీఏ పెంపుతో ఆర్టీసీ సంస్థపై నెలకు 2.82కోట్ల అదనపు భారం పడనుంది. చివరగా 2025జూలైలో ప్రభుత్వం 2.1శాతం డీఏ పెంచింది. ఇక గడిచిన మూడు నెలల బకాయిలను రాబోయే 3 నెలల్లో ఒక్కో నెల సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది.

మే 2024లో RPS-2017 అమలు చేసిన తర్వాత, తాజా డీఏ పెంపుతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలేవీ పెండింగ్‌లో లేవని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆర్టీసీలో పెండింగ్ పనులు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు. ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు. కారుణ్య నియామకాలు, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, కొత్త బస్సుల కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలతో సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. లైఫ్ లైన్‌గా ఉన్న ఆర్టీసీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డికి, ఆర్ఎంలకు మంత్రి పొన్నం సూచించారు.