విధాత : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ద పరిస్థితుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మార్గంలో ఇరాన్ ఆంక్షలతో భారత్ కు ఆగిపోయిన చమురు, గ్యాస్ సరఫరా పునురుద్దరించబడటంతో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత కు చెక్ పడబోతుంది. నిన్న ఐఎన్‌ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలతో గుజరాత్ ముంద్రా ఓడరేవుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మంగళవారం నందాదేవి నౌక కుడా భారత తీరం చేరుకుంది. 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ను మోసుకొచ్చిన నందాదేవి గుజరాత్ లోని వడినార్ పోర్టుకు చేరుకుంది. ఖతార్ నుంచి బయలుదేరి హార్మూజ్ జలసంధిని దాటుకుని భారత్ కు చేరింది. శివాలిక్, నందాదేవిల రాకతో దేశానికి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ అందినట్లయ్యింది. దీంతో భారత్ లో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ సమస్యలకు తెరపడనుంది.
యుద్దం కారణంగా హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు శివాలిక్, నందాదేవిలు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటి భారత్ కు చేరాయి. అలాగే పర్షియన్ గల్ఫ్‌కు పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని అవి కూడా భారత్ వైపు బయలు దేరుతున్నాయని అధికారులు తెలిపారు. 80వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌తో వస్తోన్న ‘జగ్ లాడ్కీ’ నౌక మంగళవారం భారత్‌కు చేరుకోనుందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Nabha Natesh | సిల్క్ పింక్ చీరలో నభా నటేష్ అందాల జాతర
Telangana HAM roads scam| తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ.18వేల కోట్ల స్కామ్ : మాజీ మంత్రి హరీశ్ రావు
