VC Sajjanar : ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే కేసులే : హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక: ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే 221, 132, 121(1) సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

VC Sajjanar

విధాత, హైదరాబాద్ : పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, వారిపై దాడులు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ పైదాడి కేసులో ఆయన సీరియస్ గా స్పందించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే 221, 132, 121(1) సెక్షన్స్ ప్ర‌కారం క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం అని తెలిపారు.

ఒక్క‌సారి కేసు న‌మోదైతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుందన్నారు. పాస్ పోర్టు జారీకి, ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వ‌స్తాయని వీసీ సజ్జనార్ తెలిపారు. అందుకే ఆవేశంలో తప్పు చేసి కేసులు పాలు కాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

Latest News