విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నల్లకుంట శంకర్ మఠంలో శ్రీ శ్రుంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారిని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిశారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీస్వామివారికి సీఎం వివరించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి విధుశేఖర భారతీ స్వామివారి సూచనలు స్వీకరించారు.
