Site icon vidhaatha

Indonesia | ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం. 11 మంది మృతి

విధాత, జకార్తా : ఇండోనేషియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది మృతి చెందారు. బస్సు, కొండ పైనుంచి కిందికి దిగుతుండగా బ్రేకులు ఫెయిలై బస్సువేగంగా కిందికి దూసుక వెళుతూ ఒక కారును, మరో మోటర్ బైక్‌ను ఢీ కొట్టింది. దానితో ఈ ప్రమాదం సంభవించింది. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే అనుమానిస్తున్నారు. పశ్చిమ జావా రాష్ట్ర పోలీస్ అధికార ప్రతినిధి జూలెస్ అబ్రహం అబాస్ట్ తెలిపిన వివరాల మేరకు ఇండోనేషియా రాజధాని జకార్తాకు దూరంగా బాండుంగ్ కొండల ప్రాంతాలున్నాయి. ఈ కొండల ప్రాంతంలోని దీపొక్ హై స్కూల్లో పట్టభద్రుల గౌరవ- సన్మానోత్సవం జరిగింది.

ఉత్సవం ముగిసిన అనంతరం విద్యార్థులు, కొందరు ఉపాధ్యాయులు తిరిగి వెలుతున్న సందర్భంలో శనివారం రాత్రి తెల్లవారు జామున ఈ బస్సు ప్రమాదం సంభవించింది.
కిక్కిరిసి ఉన్న బస్సు కొండ ప్రాంతం ఎగువ నుంచి ఘాట్‌ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న క్రమంలో బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బస్సు ఎదురుగా వస్తున్న కారును, మరో మోటార్ బైక్ ను ఢీ కొట్టింది. ఆ తర్వాత బస్సు స్పీడ్ గా వెళ్లి కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది. దానితో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 9 మంది ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు హాస్పటల్లో మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక టీచర్ కూడా ఉన్నారు. మరొకతను మోటార్ బైక్ కు చెందిన వాడని పోలీసులు చెబుతున్నారు.

ఈ దుర్ఘటన లో 53 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప హాస్పిటల్ లోకి వైద్యం నిమిత్తం తరలించారని పోలీస్ ప్రతినిధి అబాస్ట్ తెలియ జేశారు. గాయపడ్డవారిలో చాలామంది చావు బతుకుల్లో ఉన్నారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అందించడం జరుగుతుందన్నారు. లోకల్ టెలివిజన్ ఫుటేజీల మేరకు బస్సు చీకటిలో బోల్తా కొట్టి పడి ఉందని తెలుస్తున్నది. రెస్క్యూటీం, పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇండోనేషియాలో రోడ్డు యాక్సిడెంట్లు సర్వసాధారణమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇక్కడ రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, గతంలో తూర్పు జావా రాష్ట్రంలో టూరిస్ట్ బస్సు డ్రైవరు మత్తులో స్పీడ్ గా నడపడంతో హైవే పైనే బస్సు బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారని, మరో 19 మంది కి గాయాలయ్యాయని గుర్తు చేస్తున్నారు. మరొక సంఘటనలో టూరిస్ట్ బస్సు చిన్న నదిలోకి దూసుకెళ్లి బోల్తా పడిందని, ఈ ప్రమాదానికి కారణం బస్సు వేగంగా నడుస్తుందని ఆ సమయంలో బ్రేకులు వేయడంతో అవి ఫెయిల్ అయ్యాయని, ఈ ప్రమాదంలో 27 మంది చనిపోగా, 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తొందరపాటు, నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలలో జనం బలవుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version