విధాత, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలలో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్స్ అఫిషియో సభ్యుల అర్హతలపై స్పష్టత ఇస్తూ ఎన్నికల కమిషన్ అధికారిక సర్క్యూలర్ విడుదల చేసింది. ఈ నెల 16న జరుగబోయే కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటు వేయవచ్చని పేర్కొంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్‌అఫీషియో ఓటు నమోదుకు నేటి వరకు ఎస్‌ఈసీ అవకాశం ఇచ్చింది.
అయితే రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు.. తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్‌అఫీషియో ఓటు వేయాలి. మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. అర్హతలేని సభ్యులకు ఓటు హక్కు ఉండదన్న ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి :
Love Hornbills Day : ప్రేమికులకే ఆదర్శం..ఆ దేశం పక్షుల జంట !
Engine Explosion | 27 వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్కసారిగా పేలిన ఇంజిన్
