• Telugu News
  • /International

Engine Explosion | 27 వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్క‌సారిగా పేలిన‌ ఇంజిన్

నైజీరియా (Nigeria)లో ఓ విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. అరిక్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737-700 విమానం 27 వేల ఎత్తులో ప్ర‌యాణిస్తుండ‌గా ఇంజిన్ ఒక్క‌సారిగా పేలిపోయింది (Engine Explosion).

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Feb 14, 2026, 1:17 pm IST
Read Time: 5 mins
Engine Explosion | 27 వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్క‌సారిగా పేలిన‌ ఇంజిన్

Engine Explosion | ఇటీవ‌లే ప్ర‌పంచ వ్యాప్తంగా విమాన ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గ‌తేడాది జ‌రిగిన ఎయిర్ ఇండియా (Air India Plane Crash) ప్ర‌మాదం దేశంలోనే అతిపెద్ద విమాన ప్ర‌మాదంగా నిలిచిన విష‌యం తెలిసిందే. గ‌తేడాది జూన్ 12న గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ బ‌య‌ల్దేరిన‌ ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైన‌ర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఎయిర్‌పోర్టుకు స‌మీపంలోని ఓ బిల్డింగ్‌పై కుప్ప‌కూలిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్ర‌మాదం త‌ర్వాత కూడా అనేక విమాన ప్ర‌మాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సాంకేతిక స‌మ‌స్య‌లు, ఇంజిన్ వైఫ‌ల్యాల‌తో ప్రయాణికులు విమానం ఎక్కాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. తాజాగా మ‌రో షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగింది. నైజీరియా (Nigeria)లో ఓ విమానం గాల్లో ఉండ‌గా ఇంజిన్ ఒక్క‌సారిగా పేలిపోయింది (Engine Explosion). ఇందుకు సంబంధించిన భ‌యానక‌ దృష్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

అరిక్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737-700 విమానం (Arik Air Boeing aircraft) బుధ‌వారం ఉద‌యం 7:30 గంట‌ల స‌మ‌యంలో లాగోస్ నుంచి పోర్ట్ హార్కోర్ట్‌కు బయల్దేరింది. ముహమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం దాదాపు 27 వేల ఎత్తులో ప్ర‌యాణిస్తోంది. ఉన్న‌ట్టుండి భారీ శ‌బ్దంతో ఎడ‌మ‌వైపు ఇంజిన్ పేలిపోయింది. ఆ స‌మ‌యంలో విమానంలో 80 మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌తో వారంతా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్లు వెంట‌నే ఈ విష‌యాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. అనంత‌రం వారి అనుమ‌తితో ఎంతో చాక‌చ‌క్యంగా స‌మీపంలోని జెనిన్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అందులోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రోవైపు తాజా ఘ‌ట‌న‌పై నైజీరియన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (NSIB) విచారణ ప్రారంభించింది. ఇంజిన్‌లోని ‘ఫ్యాన్ బ్లేడ్’ విరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేర‌కు పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌రోవైపు ఘ‌ట‌న‌కు సంబంధించిన షాకింగ్ దృష్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి :

Jagitial Municipal Elections : ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ను నలిపేశారు..జగిత్యాలలో రెబెల్స్ హవా
Vijay | విజయ్ వ్యాఖ్యలపై హాట్ డిస్క‌ష‌న్… పవన్ కళ్యాణ్ డైలాగ్ రిపీట్ చేశారా?