Vijay | విజయ్ వ్యాఖ్యలపై హాట్ డిస్కషన్… పవన్ కళ్యాణ్ డైలాగ్ రిపీట్ చేశారా?
Vijay | సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి రావడం భారతదేశంలో కొత్త విషయం కాదు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. హీరోయిన్లు కూడా రాజకీయాల్లో తమ ముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ ను స్థాపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Vijay | సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి రావడం భారతదేశంలో కొత్త విషయం కాదు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. హీరోయిన్లు కూడా రాజకీయాల్లో తమ ముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ ను స్థాపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే దారిలో ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయ రంగప్రవేశం చేసి సంచలనం సృష్టించారు. ఆయన “తమిళగ వెట్రి కళగం” (TVK) అనే రాజకీయ పార్టీని స్థాపిస్తూ ఇకపై సినిమాలకు దూరంగా ఉంటానని, పూర్తిగా ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రకటించడం అభిమానుల్లోనే కాక రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
పార్టీ ఏర్పాటు తర్వాత విజయ్ పలు మీటింగ్‌లు నిర్వహిస్తూ తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా జరిగిన ఒక రాజకీయ సమావేశంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతాయని, వాటిని తీసుకోవడంలో తప్పు లేదని, ఎందుకంటే ఆ డబ్బు ప్రజలదేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే డబ్బు తీసుకున్న తర్వాత ఓటు మాత్రం తమ పార్టీ అయిన TVKకే వేయాలని కోరారు. ఇదే విధమైన డైలాగ్‌ను గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూడా వినిపించడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు విజయ్ వ్యాఖ్యలను విస్తృతంగా షేర్ చేస్తూ పోలికలు గీయడం మొదలుపెట్టారు.
విజయ్ కావాలనే ఆ డైలాగ్ ఉపయోగించారా లేక ప్రసంగంలో సహజంగా వచ్చిందా అనే అంశంపై నెటిజన్ల మధ్య చర్చ కొనసాగుతోంది. మరోవైపు విజయ్ చేస్తున్న ప్రసంగాలు, ప్రజలతో కలిసిపోవడం చూస్తుంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్‌లానే రాజకీయాల్లో మంచి స్థానం సంపాదిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా నుంచి రాజకీయాల వైపు మళ్లిన విజయ్ భవిష్యత్ ప్రయాణం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram