Love Hornbills Day : ప్రేమికులకే ఆదర్శం..ఆ దేశం పక్షుల జంట !

వాలెంటైన్స్ డే సందర్భంగా వైరల్ అయిన హార్న్‌బిల్ పక్షుల ప్రేమ కథ. జీవితాంతం ఒకే భాగస్వామితో ఉండే ఈ జంటకు థాయిలాండ్‌లో ప్రత్యేక దినోత్సవం.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Feb 14, 2026, 1:50 pm IST
Read Time: 4 mins
Love Hornbills Day : ప్రేమికులకే ఆదర్శం..ఆ దేశం పక్షుల జంట !

విధాత : పవిత్ర ప్రేమకు చిహ్నంగా ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటుంటారు. అయితే నేటి రోజుల్లో యువతీ యువకుల ప్రేమ.. అపనమ్మకాలు, ఇగోల మధ్య కొనసాగుతూ ప్రేమ బంధాలు మున్నాళ్ల ముచ్చటగా మారి..ప్రేమికుల దినోత్సవాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అయితే మనుషులకే ప్రేమ పాఠాలు చెప్పే రీతిలో ఓ దేశంలో పక్షుల ప్రేమ కొనసాగుతున్న తీరు ఇప్పుడు వైరల్ గా మారింది.

అసలైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే హార్న్‌బిల్ పక్షుల స్వచ్చమైన ప్రేమ బంధం వీడియోను ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ‘వాలంటైన్స్ డే’ సందర్భంగా పోస్టు చేయగా అది కాస్తా నెటిజన్లు ఆకట్టుకుంటుంది. హార్న్ బిల్ పక్షులు తమ జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటూ, పరస్పర నమ్మకంతో జీవిస్తాయి. ఆడ పక్షి గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచే సమయంలో గూడును మూసివేసుకుంటుంది. ఆ 3-4 నెలల పాటు మగ పక్షే ఆహారాన్ని తెచ్చి అందిస్తుంది. వీటి అంకితభావానికి, స్వచ్చమైన ప్రేమ బంధానికి గుర్తుగా థాయిలాండ్‌లో ప్రతి ఏటా ఫిబ్రవరి 13ను ‘లవ్ హార్న్‌బిల్స్ డే’గా జరుపుకుంటుండటం ఆనవాయితీగా కొనసాగుతుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు..మనుషుల ప్రేమ కంటే ఆ పక్షుల ప్రేమ ఎంత పవిత్రమైందో..స్వచ్చమైనదో అర్దమవుతుందని..నిజంగా ఈ ప్రేమపక్షుల జంట.. ప్రేమికులకు ఆదర్శనీయమంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Engine Explosion | 27 వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్క‌సారిగా పేలిన‌ ఇంజిన్
10 month old Alin saves five lives | ప్రాణ‌దాత‌.. ఐదుగురికి జీవితాన్ని ప్ర‌సాదించిన 10 నెల‌ల‌ చిన్నారి