Neem Datun | ఆన్‌లైన్‌లో వేప పుల్ల‌లు.. ధ‌ర తెలిస్తే షాకే..!

మ‌న ద‌గ్గ‌ర ఫ్రీగా దొరికే వేప పుల్ల‌ల‌ (Neem Datun)కి విదేశాల్లో భారీ గిరాకీ ఉంది. అమెజాన్ (Amazon) వంటి సంస్థ‌లు విదేశాల్లో ఈ వేప పుల్ల‌ల్ని 'నేచురల్ టూత్ బ్రష్‌'ల (natural toothbrushes) పేరుతో భారీ ధ‌ర‌కు అమ్ముతున్నాయి.

ayurvedic natural organic neem datun

Neem Datun | ఒకప్పుడు… తెల్లారుతూనే దంతధావనానికి వేప పుల్లల్ని (neem datun) వాడేవాళ్లం. దీని వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి. వేప పుల్ల‌లోని యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు నోటిలోని చెడు బ్యాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. చిగుళ్లు స్ట్రాంగ్ అవుతాయి. నోటి ద‌ర్వాస‌న కూడా త‌గ్గుతుంది. కానీ కాలం మారేకొద్దీ బ్రెష్‌లు, పేస్ట్‌లు వ‌చ్చాయి.

కానీ, ప‌ల్లెటూర్ల‌ల్లో ఇప్ప‌టికీ చాలా మంది ఈ వేప పుల్ల‌ల‌తోనే (ayurvedic natural organic neem datun) దంతాలు తోముకుంటున్నారు. మనకు వేప పుల్ల‌లు అందుబాటులోనే ఉంటాయి. వీధుల్లో, ఇళ్ల వ‌ద్ద పెర‌ట్లో కావ‌ల్సిన‌న్ని వేప చెట్లు ఉంటాయి. వాటి నుంచి మ‌నం ఫ్రీగానే వేప పుల్ల‌ల‌ను తీసుకోవ‌చ్చు. కానీ అలాంటి వేప పుల్ల‌ల్ని కూడా ఆన్‌లైన్‌లో అమ్ముతుండ‌టం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. వీటికి అంత‌ర్జాతీయ స్థాయిలో భారీ డిమాండ్ ఉండ‌టం విశేషం. ‘నేచురల్ టూత్ బ్రష్‌స‌ల (natural toothbrushes) పేరుతో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తీదీ ఆన్‌లైన్‌లో ల‌భిస్తోంది. మ‌న ద‌గ్గ‌ర ఉచితంగా దొరికేది కూడా కొన్ని ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ఆన్‌లైన్ ద్వారా భారీ ధ‌ర‌కు విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి వాటిలో ఈ వేప పుల్ల కూడా ఒక‌టి. ప‌ల్లెటూర్ల‌ల్లో ఫ్రీగా దొరికే ఈ వేప పుల్ల‌లు అమెజాన్ (Amazon) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో 20 పుల్లల ప్యాకెట్ ధర దాదాపు 160 రూపాయల వరకూ ప‌లుకుతోంది. అదే అమెరికా వంటి దేశాల్లో మాత్రం ఈ వేప పుల్ల‌ల ధ‌ర రూ.వేల‌ల్లో ఉండ‌టం విశేషం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ ఫొటో ఆధారంగా విదేశాల్లో ఈ వేప పుల్ల‌ల్ని రూ.2,266కి అమ్ముతుండ‌టం గ‌మ‌నార్హం. ప్రకృతి సిద్ధమైన జీవనశైలిలో భాగంగా చాలామంది వీటికే మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. వేపలోని సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ గుణాలు చిగుళ్లను దృఢపరుస్తాయి.

ఇవి కూడా చదవండి :

Telangana State Election Commission : మున్సిపల్ ఎన్నికలలో ఎక్స్‌ అఫీషియో ఓటర్లపై ఈసీ ఉత్తర్వులు
Love Hornbills Day : ప్రేమికులకే ఆదర్శం..ఆ దేశం పక్షుల జంట !

Latest News