Site icon vidhaatha

12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు.. మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు

విధాత:రాబోయే సెప్టెంబర్ 25-26, 2021 (శనివారం, ఆదివారం) తారీకులలో టొరంటో, కెనడా ప్రధాన కేంద్రంగా అంతర్జాలంలో జరుగుతున్న “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు త్వరితగతిని జరుగుతున్నాయి అని తెలియపరచడానికి ఆనందంగా ఉంది.
• మా ఆహ్వానాన్ని మన్నించి సుమారు 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలు ఎంతో ఉత్సాహంగా స్పందించి తమ ప్రసంగ ప్రతిపాదనలని మాకు పంపించడం ఎంతో సంతోషాన్ని కలగజేస్తోంది. ఆయా వక్తలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ అవకాశం కలిగించడానికి సదస్సు జరిగే సమయాలని రెండు రోజులూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా (EST, Toronto Time) పొడిగించాం…..అంటే మొత్తం 20 గంటలకి పైగా..
• టొరాంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా జరిగే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించే లా అంతర్జాలంలో జరుగుతుంది.
• ప్రపంచంలో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి ఇంత పెద్ద ఎత్తున తమదే అయిన ఒక సాహిత్య వేదిక మీద కలుసుకోవడం మాకు తెలిసీ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ సదస్సుని ఆసాంతం వీక్షించి, ఆనందించమని మీకు మా విన్నపం. సమగ్ర కార్యక్రమం, ప్రసంగాల వివరాలు త్వరలో ప్రకటిస్తాం.
రెండు రోజుల సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూసే లింక్ లు (EST, Toronto Time 9:00 AM-7:00 PM….ప్రతీ రోజూ)
• September 25, 2021 YouTube: https://bit.ly/3zcq0O1
• September 26, 2021 YouTube: https://bit.ly/3mjgLYS
ప్రతిష్టాత్మకమైన ఈ ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సు తాజా సమాచారం ఇక్కడ జతపరిచిన 3వ ప్రకటన లో ఛూడండి. అంతే కాదు. త్రివిక్రమ్ సింగరాజు రచన, శశి వర్ధన్ పట్లోళ్ళ దర్శకత్వం లో కెనడా యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేల ఈ సదస్సు గురించి అందించిన వివరాలు ఈ క్రింది వీడియో లింక్ లలొ చూడండి. https://youtu.be/U4tX3dNHlKwసదస్సుకు సంబంధించిన ఏ విషయానికైనా ఈ క్రింది వారిని సంప్రదించండి.
• సంచాలకులు : లక్ష్మీ రాయవరపు (టొరంటో, కెనడా): sadassulu@gmail.com
• వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సస్, USA): vangurifoundation@gmail.com
• సంధాన కర్తలు: విక్రమ్ సింగరాజు (కెనడా): triv.sing@gmail.com; శాయి రాచకొండ (USA): sairacha@gmail.com
• కార్యనిర్వాహక సంఘం సభ్యులు: యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్ ఖాన్, కృష్ణ కుంకాల
• నిర్వహిస్తున్న సంస్థలు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరాంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణా అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరాంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం

Exit mobile version