Site icon vidhaatha

ఫిన్‌ల్యాండ్ సెకండ‌రీ స్కూల్‌లో కాల్పుల క‌ల‌క‌లం

ఫిన్ ల్యాండ్: ఫిన్‌ల్యాండ్‌లోని ఓ సెకండ‌రీ స్కూల్‌లో కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. వివ‌రాల్లోకి వెళితే ద‌క్షిణ ఫిన్‌ల్యాండ్‌లోని వాంట అనే పట్టణంలో గ‌ల‌ సెకండ‌రీ స్కూల్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల ప్రాంతంలో 12 ఏళ్ల విద్యార్థి తోటి విద్యార్థుల‌పై కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో 6వ త‌రగ‌తి చ‌దువుతున్న బాలుడు మృతి చెంద‌గా మ‌రో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారని, వారు చావు బ్ర‌తుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారని అధికారులు తెలిపారు. ఆ స్కూల్‌లో దాదాపు 800 మంది విద్యార్థులు చ‌దువుతున్నారు. కాల్పులు జరిగాయ‌న్న స‌మాచారం అందుకున్న వెంట‌నే భారీగా పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. అనంత‌రం నిందితున్ని రాజ‌ధాని ఎల‌శంకై స‌మీపంలో అదుపులోకి తీసుకున్నారు. బాలుడి వ‌ద్ద హ్యాండ్‌గ‌న్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని పెట్టేరి ఆర్పో దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు దేశం చ‌విచూసింద‌ని, ఆ విషాద ఛాయ‌లు దేశ ప్ర‌జ‌ల క‌ళ్ళ‌ల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయ‌న్నారు. 2007 నవంబర్‌లో 18 ఏళ్ల విద్యార్థి జ‌రిపిన‌ కాల్పుల్లో 9 మంది చనిపోయారు. తర్వాత నిందితుడు కూడా తన పిస్టల్ తో ఆత్మహత్య చేసు కొన్నాడు. సెప్టెంబర్ 2008లో 22 ఏళ్ల విద్యార్థి తన సెమీ ఆటోమేటిక్ పిస్టల్ తో జరిపిన కాల్పుల్లో కోచింగ్ కాలేజీకి సంబంధించిన పదిమంది విద్యార్థులు చనిపోయారు. ఆ త‌రువాత‌ త‌న‌ను తానే కాల్చుకొని చ‌నిపోయాడు.

Exit mobile version