SISU OTT:
విధాత: 2023 జనవరిలో ఫిన్‌లాండ్ దేశం నుంచి అనామక చిత్రంగా థియేటర్లలోకి వచ్చి ప్రపంచ యాక్షన్ ప్రియులను షేక్ ఆడించిన హాలీవుడ్ సినిమా సిసు (Sisu). జోర్మా టోమిలా (Jorma Tommila), అక్సెల్ హెన్నీ (Aksel Hennie), జాక్ డూలన్, మిమోసా విల్లామో, ఒన్నీ టోమిలా కీలక పాత్రల్లో నటించారు. జల్మారి హెలాండర్ (Jalmari Helander) రచన, దర్శకత్వం చేశారు. 6మిలియన్ల ఫిన్‌లాండ్ కరెన్సీతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించి 15 మిలియన్ డాలర్లను కొల్లగొట్టడం విశేషం. అంతేకాదు ఇప్పటికీ వరల్డ్ వైడ్ ఆల్‌టైమ్ హెవీ యాక్షన్ మూవీస్ జాబితాలో ఫస్ట్ స్థానంలో ఉండడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో జాన్ విక్ ఇతర చిత్రాలున్నాయి.
1944 రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో జర్మనీకి చెందిన నాజీలు ఇతర దేశాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో తమ సైన్యాన్ని ఫిన్లాండ్‌లోకి ప్రవేశించి కొన్ని ప్రాంతాలను చేతిలోకి తీసుకుంటాయి. ఈ క్రమంలో అయితే అటామి కోర్పి అనే వయసు మీద పడ్డ ఓ రిటైర్ మిలటరీ ఉద్యోగి లాప్లాండ్ అనే ఊరు బయట తన గుర్రంతో కలిసి ఒంటరిగా జీవిస్తుంటాడు. ఖాళీ సమయాల్లో బంగారం కోసం నీటిలో, భూమిలో వెతుకుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈక్రమంలో అతనికి ఓ రోజు తవ్వకాల్లో భారీగా బంగారం దొరుకుతుంది. దానిని సిటీకి వెళ్లి వ్యాపారులకు అమ్మి డబ్బు తెచ్చుకోవాలని నిర్ణయించకుని బంగారం తీసుకుని గుర్రంపై ప్రయాణం ప్రారంభిస్తాడు. కానీ మార్గం మధ్యలో నాజీ సైనికులు అడ్డు పడి ఇబ్బంది పెడతారు. అతని వద్ద బంగారం ఉందని గుర్తించి దానిని లాగేసుకుంటారు. SISU OTT
ఈ నేపథ్యంలో.. రిటైర్డ్ మిలటరీ వ్యక్తి అయిన అటామి కోర్పి తిరగబడతాడు. వచ్చిన వారిని వచ్చినట్లు, కనిపించిన వారిని కనిపించినట్లు చంపేసుకుంటూ వెళతాడు. కానీ నాజీ సైన్యం ఒక ట్రూప్ తర్వాత మరో ట్రూప్ రావడంతో శక్తికి మించి పోరాడలేక వారికి పట్టుబడిపోతాడు. ఇక ఆ తర్వాత ఆ అతను ఏం చేశాడు, నాజీ సైన్యాన్ని చివరి వరకు ఎలా ఎదుర్కొన్నాడు, తన బంగారాన్ని దక్కించుకున్నాడా లేదా, నాజీలు అక్రమంగా తరలిస్తున్న యువతులను ఎలా రక్షించాడు అనే ఆసక్తికరమైన కథకథనాలతో కేవలం ఐదారు పాత్రల చుట్టూ మాత్రమే సినిమా సాగుతూ ఎక్కడా బోర్ అనేదే రాకుండా అఖరి సన్నివేశం వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.
అయితే రెండేండ్ల క్రితమే థియేటర్లకు, ఆపై ఓటీటీకి కూడా వచ్చిన ఈ సినిమా ఇండియాలో మాత్రం ఓటీటీ (Ott) స్ట్రీమింగ్‌కు రాలేదు. సుమారు ఏడాదిన్నర తర్వాత తాజాగా ఈ సినిమాను మన దేశంలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం సోనీ లివ్ (Sony Liv) లో ఇంగ్లీష్, హాందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి తెలియని వాళ్లు, ఇప్పుడు చూడాలనుకునే వారు, ముఖ్యంగా అదిరిపోయే యాక్షన్ సినిమా కావాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకుండా చూసి తీరాల్సిందే. గూస్‌బమ్స్ గ్యారంటీ.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యామని అనుకోవడం కూడా పక్కా. మరో విషయమేంటంటే ఈ సినిమా సాధించిన విజయం దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ సిసు (Sisu) సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ యేడు చివరలో గానీ వచ్చే ఏడాది గానీ ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.