కాబూల్ పై అమెరికా ఎయిర్ స్ట్రైక్

విధాత: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని క్వాజా బుగ్రా ప్రాంతంలో అమెరికా జరిపిన ఎయిర్‌స్ట్రైక్‌లో ఆరుగురు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులున్నారు. ఐసిస్ సుసైడ్ బాంబర్‌ లక్ష్యంగా ఎయిర్‌స్ట్రైక్ జరిపినట్లు అమెరికా వెల్లడించింది. ఆత్మాహుతి దళ సభ్యుడు వాహనం ద్వారా కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాడికి యత్నించగా తాము విఫలం చేశామని వెల్లడించింది. తమ ఎయిర్‌స్ట్రైక్‌లో అనేకమంది సుసైడ్ బాంబర్లు చనిపోయారని తెలిపింది. తాము ఎయిర్ స్ట్రైక్ జరిపి వాహనాన్ని ధ్వంసం చేయకపోయి ఉంటే ఆత్మాహుతి దాడిలో అనేకమంది […]

  • Publish Date - August 30, 2021 / 04:14 AM IST

విధాత: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని క్వాజా బుగ్రా ప్రాంతంలో అమెరికా జరిపిన ఎయిర్‌స్ట్రైక్‌లో ఆరుగురు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులున్నారు. ఐసిస్ సుసైడ్ బాంబర్‌ లక్ష్యంగా ఎయిర్‌స్ట్రైక్ జరిపినట్లు అమెరికా వెల్లడించింది. ఆత్మాహుతి దళ సభ్యుడు వాహనం ద్వారా కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాడికి యత్నించగా తాము విఫలం చేశామని వెల్లడించింది. తమ ఎయిర్‌స్ట్రైక్‌లో అనేకమంది సుసైడ్ బాంబర్లు చనిపోయారని తెలిపింది. తాము ఎయిర్ స్ట్రైక్ జరిపి వాహనాన్ని ధ్వంసం చేయకపోయి ఉంటే ఆత్మాహుతి దాడిలో అనేకమంది చనిపోయేవారని అమెరికా వెల్లడించింది.