న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కొన్ని నెలల క్రితం దాకా ఆ దేశంలో అధికారం చెలాయించిన మాజీ ప్రధాని షేక్ హసినా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేశారు. తాత్కాలిక అధ్యక్షేుడు యూనస్ ఖాన్ ప్రభుత్వం అవామీ లీగ్ పే నిషేధం ప్రకటించింది. ఈ నిర్ణయంతో వచ్చేయడాది ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అవామీ లీగ్ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం రాత్రికి రాత్రే సవరించిన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం అవామీ లీగ్ పై నిషేధం విధించింది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై విచారణ పూర్తి చేసే వరకూ దానిపై నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ఈ ఏడాది మే 13న అవామీ లీగ్ పై నిషేధం విధించారు.
బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ చైర్మన్ తారిక్ రహమాన్ ఎంట్రీ
ఓ వైపు మాజీ ప్రధాని షేక్ హసినా పార్టీ అవామీ లీగ్ పై నిషేధం విధించిన సందర్బంలో.. మరోవైపు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ బంగ్లా రాజకీయాల్లోని రీ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. స్వీయ బహిష్కరణలో ఉన్న ఆయన.. 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో కలిసి బంగ్లాలో అడుగుపెట్టారు. ఇంతకాలం ఆయన లండన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢాకా ఎయిర్‌పోర్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ సమయంలో ఆమె కుమారుడు తారిక్ రహమాన్ స్వదేశానికి తిరిగి రావడం పట్ల బీఎన్పీ పార్టీ శ్రేణులు హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. రహమాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి యాక్టింగ్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇటు భారత్ సైతం రహమాన్ రాక తోనైనా రెండు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలు పునరుద్దరించబడుతాయని ఆశిస్తుంది. ప్రస్తుత యూనస్ ప్రభుత్వ విధానాలను రహమాన్ వ్యతిరేకిస్తున్నారు. జమాత్-ఇ-ఇస్లామీతో పొత్తుకు ఆయన అనుకూలంగా లేరు. ఈ జమాత్.. పాకిస్థాన్ ఐఎస్‌ఐకు తొత్తుగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. హసీనా హయాంలో దీనిపై నిషేధం ఉంది.
ఇవి కూడా చదవండి :
Eesha Movie Review | ‘ఈషా’ భయపెడుతుందన్నారు.. మరి భయపెట్టిందా.?
Bird Flu : కేరళలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ
