టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో తొలి సారిగా బౌలింగ్ టోర్నమెంట్ 2024

సింగపూర్‌లోని సోనిక్ బౌల్, వన్ టాంపనీస్ హబ్ లో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో బౌలింగ్ టోర్నమెంట్ 2024 విజయ వంతంగా నిర్వహించారు. ఈ టోర్నీలో సుమారు 100 మంది పాల్గొన్నారు

  • Publish Date - June 2, 2024 / 08:30 PM IST

సింగపూర్‌లోని సోనిక్ బౌల్, వన్ టాంపనీస్ హబ్ లో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో బౌలింగ్ టోర్నమెంట్ 2024 విజయ వంతంగా నిర్వహించారు. ఈ టోర్నీలో సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో చిన్నా పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టాప్ మూడు గ్రూప్ లకు, అడల్ట్స్ టాప్ 3 వ్యక్తిగత బౌలింగ్ స్కోర్ (అడల్ట్స్) మరియు చిల్డ్రన్ టాప్ 3 వ్యక్తిగత బౌలింగ్ స్కోర్ కేటగిరీ లలో విజేతలకు బహుమతులు అందజేశారు.

 

టీసీఎస్‌ఎస్ బౌలింగ్ టోర్నమెంట్ 2024 విజేతల వివరాలు:
టాప్ 1 గ్రూప్: రవి కుమార్ గుత్తుల, నారాయణ పులిపాక, ఆనంద్ తుమ్మల, వంశీ పులిపాక మరియు ఆదిత్య గుత్తుల (658)
టాప్ 2 గ్రూప్: ప్రదీప్ మిర్యాల, భరత్ రెడ్డి పింగిళి ,సాయి సందీప్ తల్లం, వెంకట రాఘవరావు ఆలపాటి మరియు అశ్విన్ కుమార్ జెక్సాని (552)
టాప్ 3 గ్రూప్: శ్రీమన్ మన్నము, మరిలౌ పగియా , వెంకటేష్ గుప్త గజవాడ , తరుణ్ పెద్ది మరియు శివ ప్రసాద్ ఆవుల (433)

 

టాప్ 3 అడల్ట్ స్కోర్:
టాప్ 1 – అడల్ట్ స్కోర్: రవి కుమార్ గుత్తుల (187)
టాప్ 2 – అడల్ట్ స్కోర్: వెంకటేష్ గుప్త గజవాడ (148)
టాప్ 3 – అడల్ట్ స్కోర్: రమేష్ గడప (147)

టాప్ 3 చిల్డ్రన్ స్కోర్:
టాప్ 1 – చిల్డ్రన్ స్కోర్: యువ టేకూరి (73)
టాప్ 2 – చిల్డ్రన్ స్కోర్: శ్రీహన్ తోట (68)
టాప్ 3 – చిల్డ్రన్ స్కోర్: సుహాస్ యమసాని (57)

ఈ టోర్నమెంట్ కు సమన్వయ కర్తలుగా సొసైటీ ఉపాధ్యక్షులు, భాస్కర్ గుప్త నల్లా, ప్రాంతీయ కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి , సతీష్ పెసరు, మణికంఠ మరియు లక్ష్మణ్ రాజు కల్వ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి కాసర్ల శ్రీనివాసరావు వ్యాక్యత గ వ్యవహిరించారు.

ఈ సందర్భంగా సొసైటి సభ్యులు మాట్లాడుతూ, సింగపూర్ లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందజేయడం కొరకు వివిధ పండుగలను జరుపుకోవడమే కాకుండా సింగపూర్ లో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారి లో క్రీడాస్పూర్తి ని పెంపొందించేందుకు వివిధ ఆటల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో పాల్గొని విజయ వంతం చేసిన క్రీడాకారులందరికి కృతజ్ఞతలు తెలిపి, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు గడప రమేష్ బాబు, కోశాధికారి సంతోష్ కుమార్ జులూరి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి మరియు దుర్గాప్రసాద్  కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, ప్రవీణ్ మామిడాల మరియు శివ ప్రసాద్ ఆవుల మొదలగు వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి

Latest News