విధాత : కెనడా( Canada)లో భారత విద్యార్ధి(Indian student killed)ని దుండగులు తుపాకితో కాల్చి(shooted) చంపారు. టొరంటో స్కార్‌బొరౌగ్ విశ్వవిద్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థి (20) మృతి చెందాడు. ఈ ఘటనపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని, స్థానిక అధికారుల సమన్వయంతో వారికి అవసరమైన సాయం అందిస్తాం అని తెలిపింది.
హైల్యాండ్ క్రీక్ ట్రెయిల్ వద్ద టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంక్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారని స్థానిక పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని..అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. నిందితులు కూడా అక్కడి నుంచి పరారయ్యారన్నారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో కళాశాల క్యాంపస్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన యూనివర్సిటీ విద్యార్థులను భయాందోళనకు గురిచేసింది. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలపై ఆశతో ఎంతో భవిష్యత్తును ఊహించుకుని విదేశాలకు వెలుతున్న భారతీయ యువత అక్కడి ఉన్మాదుల చేతుల్లో బలవ్వడం ఆందోళన కల్గిస్తుంది.
