ఇండిగో ఏయిర్ లైన్స్ సంక్షోభమేనా
Rahul Bhatia | దేశీయ విమానయానరంగంలో భారీ కుదుపునకు కారణమైన ఇండిగో ఏయిర్ లైన్స్( Indigo Airlines ) మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా( Rahul Bhatia ). ఇండిగో ఏయిర్ లైన్స్ పేరెంట్ కంపెనీ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కు కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. 1989 లో ఏర్పాటు అయిన ఈ సంస్థ అనేక రంగాలకు విస్తరించింది.
రాహుల్ భాటియా ప్రస్తుతం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ఈయన వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. కెనాడా దేశం ఒంటారియో లోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్ లూ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. భాటియా నాయకత్వంలో ఇండిగో తో పాటు హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఏయిర్ లైన్స్ మేనేజిమెంట్, అడ్వాన్సుడు పైలట్ ట్రైనింగ్, ఏయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ రంగాలకు విస్తరించింది.
బీఎస్ఈ వివరాల ప్రకారం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లో భాటియా కు 0.01 శాతం పెట్టుబడులు (40వేల షేర్లు) ఉన్నాయి. డిసెంబర్ 5వ తేదీ నాటికి రాహుల్ భాటియా నెట్ వర్త్ 8.1 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ రిచ్ లిస్టు ప్రకారం ప్రపంచ బిలియనీర్లలో 420వ స్థానం సంపాధించుకున్నారు. ఇండిగో ఏయిర్ లైన్స్ కుదుపుల కారణంగా ఆయన మొత్తం నెట్ వర్త్ లో శుక్రవారం నాడు 84 మిలియన్ డాలర్లు తగ్గింది.
15వ తేదీ కల్లా సాధారణ పరిస్థితులు
డిసెంబర్ 15వ తేదీ కల్లా ఇండిగో విమానాల రాకపోకలు సాధారణ స్థాయికి తీసుకువస్తామని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్(Pieter Elbers ) ఇవాళ ప్రకటించారు. శుక్రవారం నాడు కూడా వేయికి పైగా విమనాలు రద్ధయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు కలుగుతున్న అసౌకర్యానికి ఆయన క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఇండిగో ప్రతినిత్యం 2,300 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను వివిధ ప్రాంతాలకు నడుపుతుందన్నారు. సాంకేతిక లోపాలు, షెడ్యూలు మార్పులు, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ అమలు చేయడం మూలంగా సంక్షోభం తలెత్తింది.
