- స్పేస్ స్టేషన్‌కు కొత్త టెలిస్కోప్‌ను పంపుతున్న చైనా
- గురువారం స్పేస్‌స్టేషన్‌కు ముగ్గురు వ్యోమగాములు
The telescope Xuntian : విశ్వాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు చైనా సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం కొత్త టెలిస్కోప్‌ను తన స్పేస్ స్టేషన్‌లో ఏర్పాటు చేయనున్నది. తన స్పేస్ స్టేషన్ టియాంగాంగ్ వద్దకు ముగ్గురు వ్యోమగాములను పంపనున్న నేపథ్యంలో చైనా బుధవారం ఈ ప్రకటన చేసింది. ఈ టెలిస్కోప్‌కు సుంటియాన్ అని నామకరణం చేశారు. టియాంగాంగ్ తోపాటే ఇది కూడా భూమి చుట్టూ పరిభ్రమిస్తూ విశ్వాన్ని అన్వేషిస్తుందని మానవ సహిత చైనా స్పేస్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ లిన్ సీకియాంగ్ చెప్పారు. అయితే దీనిని ఎప్పటికల్లా స్పేస్ స్టేషన్‌లో అమర్చుతారన్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆకాశాన్ని వీక్షించడంతోపాటు.. మ్యాపింగ్ చేస్తుంది.
వేల సంవత్సరాలుగా చైనా.. నక్షత్రాలను, గ్రహాలను పరిశోధిస్తున్నది. అదే విశ్వాన్వేషణ, శాస్త్రంలో చైనాను అగ్రస్థానంలో నిలిపింది. ముగ్గురు వ్యోమగాములు టాంగ్ హాంగ్‌బో, టాంగ్ షెంగ్జియీ, జియాంగ్ సిన్‌లిన్‌లను చైనా తన స్పేష్‌స్టేషన్‌కు పంపనున్నది. అక్కడి సిబ్బంది తిరిగి రానున్నారు. కొత్తగా వెళ్లే వ్యోమగాములు ఆరు నెలల పాటు అక్కడ విధులు నిర్వహిస్తారు. గురువారం ఉదయం వారిని తీసుకుని వ్యోమనౌక బయల్దేరనున్నది. సౌర వ్యవస్థ కారణంగా కొన్ని శిథిలాలు స్పేస్‌స్టేషన్ సోలార్ ప్యానళ్లను తాకిన నేపథ్యంలో వాటి మరమ్మతులను కూడా కొత్తగా వెళ్లనున్న సిబ్బంది చూస్తారు. తన ఉపగ్రహాల్లో ఒకదానిని చైనా 2007లో ఒక క్షిపణిని ప్రయోగించి కూల్చివేసింది. చైనా స్పేస్‌స్టేషన్ చుట్టూ చేరిన చెత్తలో వాటి శిథిలాలే ఎక్కువ ఉన్నాయి.
తన ఖగోళ పరిశోధన శక్తిని నానాటికీ పెంచుకుంటున్న చైనా.. ఈ క్రమంఒలో ఈ దశాబ్దం చివరినాటికి చంద్రుడిపైకి మానవ సహిత యాత్రను లక్ష్యంగా పెట్టుకున్నది. గతంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చైనా భాగస్వామిగా ఉండేది. కానీ.. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ విభాగమైన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నియంత్రణలపై అమెరికా ఆందోళనల నేపథ్యంలో దాని నుంచి వైదొలిగింది. చైనా 2003లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తన తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్‌ను చేపట్టింది. తద్వారా సోవియట్ యూనియన్, అమెరికా సరసన మూడో దేశంగా నిలిచింది.
చేసే ఖర్చు విషయంలోనూ, సరఫరాల్లోనూ, సామర్థ్యాల్లోనూ చైనాను అమెరికా కొంతకాలం అధిగమించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన నమూనాలను భూమికి తీసుకుని రావడం, గతంలో ఎవరూ పరిశీలించని చంద్రుడి దూరతీరాన రోవర్‌ను దించడం వంటి విషయాల్లో చైనా ప్రగతి సాధించింది. మరోవైపు 2025 చివరికల్లా చంద్రునిపైకి వ్యోమగాములను పంపేందుకు అమెరికా ప్రయత్నాల్లో ఉన్నది. ఇందుకు ప్రైవేటు రంగానికి చెందిన స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ సహకారాన్ని తీసుకుంటున్నది. చంద్రుని విషయంతోపాటు.. రెండు దేశాలు అంగారకుడిపైకి రోవర్లను పంపాయి. ఆస్టరాయిడ్‌పైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపేందుకు కూడా అమెరికా లానే చైనా కూడా ప్రయత్నాలు చేస్తున్నది.