అంబులెన్స్‌లో య‌జ‌మాని.. పెంపుడు కుక్క ఏం చేసిందంటే..?

ఓ కుక్క తన యజమాని పట్ల విశ్వాసాన్ని ఇలా చాటుకున్నది..

  • Publish Date - January 13, 2024 / 04:21 AM IST

విధాత : కుక్క‌లు విశ్వాసానికి మారుపేరు అనేందుకు ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. త‌న య‌జ‌మాని ఆప‌ద‌లో ఉన్నాడ‌ని గ్ర‌హించిన ఓ శున‌కం.. అత‌ని వెంట అంబులెన్స్‌లో వెళ్లేందుకు తీవ్ర ప్ర‌య‌త్నం చేసింది. చివ‌ర‌కు ఆ కుక్క బాధ‌ను అర్థం చేసుకున్న అంబులెన్స్ డ్రైవ‌ర్.. దాన్ని కూడా య‌జ‌మాని వెంట అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.

ఓ వ్య‌క్తి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యాడు. దీంతో ఆ వ్య‌క్తి ఇంటి వ‌ద్దకు అంబులెన్స్ వ‌చ్చేసింది. ఇక అస్వ‌స్థ‌త‌కు గురైన వ్య‌క్తిని అంబులెన్స్‌లో ఎక్కించారు. అత‌నితో పాటు పెంపుడు కుక్క కూడా అంబులెన్స్ ఎక్కింది. కానీ సిబ్బంది ఆ శున‌కాన్ని కింద‌కు దించారు. అంబులెన్స్ కాస్త ముందుకు క‌దిలింది. కుక్క అక్క‌డితో ఆగిపోకుండా, అంబులెన్స్ వెంట ముందుకు ఉరికింది. ఆ వాహ‌నం చుట్టూ అరుస్తూ ప‌రుగులు పెట్టింది.

ఆ శున‌కానికి త‌న య‌జ‌మానితో ఉన్న బంధాన్ని అర్థం చేసుకున్న అంబులెన్స్ డ్రైవ‌ర్.. చివ‌ర‌కు దాన్ని కూడా ఎక్కించుకుని ఆస్ప‌త్రికి బ‌య‌ల్దేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. య‌జ‌మానితో పాటు శున‌కాన్ని కూడా తీసుకెళ్లిన అంబులెన్స్ సిబ్బందిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. య‌జ‌మానికి కుక్క ర‌క్ష‌ణ‌గా నిలిచింద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Latest News