ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం

విధాత‌: ఆఫ్ఘనిస్థాన్ దేశంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఛారికర్ ప్రాంతంలో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో సంభవించిన భూకంపం 18.6 కిలోమీటర్ల లోతులో వచ్చింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని ఆఫ్ఘనిస్థాన్ అధికారులు చెప్పారు. కెర్మాడెక్ దీవుల్లో శుక్రవారం భూకంపం వచ్చింది. కెర్మాడెక్ దీవుల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది.

  • Publish Date - June 25, 2021 / 06:20 AM IST