28ఏళ్ల త‌రువాత అమెరికాలో అమాంతం పెరిగిన ఇళ్ల అద్దె

విధాత: అమెరికాలో ఎన్నారైలకు కొత్త కష్టం వచ్చిపడింది. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలనుకునే వారికి ఇది ఓ చేదు వార్తనే చెప్పాలి. ఎన్నారైలకే కాదు ప్రస్తుతం అమెరికా పౌరులకే అద్దె ఇళ్లు దొరకని పరిస్థితి. కోవిడ్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో అనేకమంది సొంతింటి వారు కూడా అద్దె ఇళ్లకు మారిపోతున్నారు. దీంతో ఒక్కో ఇంటికి దాదాపు నలుగురైదుగురు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ కారణంగా.. ఉన్నట్లుండి అద్దెఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా అద్దెలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. […]

  • Publish Date - August 28, 2021 / 10:27 AM IST

విధాత: అమెరికాలో ఎన్నారైలకు కొత్త కష్టం వచ్చిపడింది. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలనుకునే వారికి ఇది ఓ చేదు వార్తనే చెప్పాలి. ఎన్నారైలకే కాదు ప్రస్తుతం అమెరికా పౌరులకే అద్దె ఇళ్లు దొరకని పరిస్థితి. కోవిడ్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో అనేకమంది సొంతింటి వారు కూడా అద్దె ఇళ్లకు మారిపోతున్నారు. దీంతో ఒక్కో ఇంటికి దాదాపు నలుగురైదుగురు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ కారణంగా.. ఉన్నట్లుండి అద్దెఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా అద్దెలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా టంపా, ఫ్లోరిడా, టూ మెంఫిస్, టెన్నెస్సీ, రివర్ సైడ్, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు శరవేగంగా పెరుగుతున్నాయి.

గత మూడు నెలల కాలంలోనే అమెరికాలో దాదాపు 5లక్షలకు పైగా అద్దె అపార్ట్‌మెంట్లలోకి జనాలు చేరుకున్నారు. 1993 తర్వాత ఈ స్థాయిలో అద్దె ఇళ్లకు జనాలు మారడం ఇదే తొలిసారని ఇండస్ట్రీ కన్‌సల్టెంట్ రియల్ పేజ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక గత నెల గణాంకాలు తీసుకుంటే రికార్డు స్థాయిలో దాదాపు 96.9 శాతం మేర అద్దె ఇళ్లు నిండాయి. ఈ పరిస్థితిని ఇళ్ల ఓనర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇంటి అద్దెలు కూడా దాదాపు 17శాతం పెంచేస్తున్నారు. అయినప్పటికీ డిమాండ్ తగ్గడంలేదు. ఇక అమెరికన్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక అక్కడికి వెళ్లే ఎన్నారైల పరిస్థితి ఎలా ఉంటోందో మరి.