Born Twice | ఒక మహిళ గర్భం( Pregnant Woman ) దాల్చిందంటే చాలు.. ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కడుపులో పెరుగుతున్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆస్పత్రికి వెళ్తారు. ఆ అనారోగ్య సమస్యను నయం చేసుకుని.. సురక్షితంగా ఉంటారు.
కొన్ని సందర్భాల్లో గర్భిణులకు( Pregnant Woman ) తీవ్రమైన అనారోగ్య సమస్యలు( Health Issues ) ఎదురైనప్పుడు.. డాక్టర్లు( Doctors ) కూడా చేతులు ఎత్తేస్తుంటారు. తమ చేతుల్లో ఏం లేదని చెబుతుంటారు. కడుపులో ఉన్న బిడ్డతో పాటు గర్భిణి కూడా చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకోటి ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి.
కానీ ఈ ఘటన వైద్య చరిత్ర( Medical Miracle )లోనే అద్భుతం. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లోనూ గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణం పోశారు వైద్యులు. సాధారణంగా అయితే ఈ కేసును చాలా మంది డాక్టర్లు( Doctors ) పట్టించుకోరు. తమ చేతుల్లో ఏం లేదని చెబుతారు. కానీ బ్రిటన్( Britain ) వైద్యులు.. ఈ కేసును సవాలుగా తీసుకుని.. తల్లీబిడ్డను సురక్షితంగా కాపాడారు. మరి ఆ క్లిష్టమైన రోగం ఏంటి..? అంటే అదే క్యాన్సర్( Cancer ).
బ్రిటన్‌కు చెందిన లూసీ ఇసాక్( Lucy Isaac ) వృత్తి రీత్యా టీచర్. 2024లో గర్భం దాల్చింది. 20 వారాల గర్భిణిగా( 20 Weeks Pregnant ) ఉన్నప్పుడు ఆమెకు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. దాంతో 2024 అక్టోబర్‌లో ఆవిడ ఆస్పత్రికి వెళ్లి అల్ట్రా సౌండ్ టెస్టులు( Ultra Sound Tests ) చేయించుకోగా, అండాశయ క్యాన్సర్( Ovarian Cancer ) అని తేలింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఇది ప్రమాదం. కాబట్టి ఆమెకు వైద్యులు సర్జరీ నిర్వహించాలని నిర్ణయించారు.
రెండు గంటల పాటు గర్భిణి కడుపు బయట గర్భం
జాన్ రాడ్‌క్లిప్ హాస్పిటల్( John Radcliffe Hospital ) వైద్య బృందం ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. డాక్టర్ సోలేమాని మజ్ద్( Dr Soleymani Majd ) నేతృత్వంలోని వైద్య బృందం.. లూసీకి సర్జరీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆమె కడుపులో ఉన్న గర్భాన్ని తొలగించారు. అనంతరం ఆ గర్భాన్ని ఓ సెలైన్ ప్యాక్( Saline Pack )లో భద్రంగా ఉంచారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి సెలైన్ ప్యాక్‌ను మార్చుతూ.. నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల మధ్య గర్భాన్ని ఉంచారు. ఇలా రెండు గంటల పాటు గర్భిణి కడుపు బయట గర్భం ఉంది. ఇది వైద్య చరిత్రలో ఒక అద్భుతమే.
ఐదు గంటల పాటు కొనసాగిన ప్రక్రియ..
లూసీకి సర్జరీ నిర్వహించి క్యాన్సర్ కణితులను( Cancer Tumors ) తొలగించారు. లూసీతో పాటు ఆమెకు పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ప్రమాదం కలగకుండా డాక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. సర్జరీ విజయవంతం అనంతరం తాత్కాలికంగా బయటకు తీసిన గర్భాన్ని మళ్లీ గర్భాశయంలో అమర్చారు. ఈ ప్రక్రియ అంతా ఐదు గంటల పాటు కొనసాగింది.
జనవరిలో లూసీ పండంటి మగబిడ్డకు జన్మ
నెలలు నిండిన తర్వాత ఈ ఏడాది జనవరిలో లూసీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ పసిబిడ్డ రెండుసార్లు జన్మించినట్లు అయింది. ఎందుకంటే 20 వారాల గర్భం అప్పుడే తాత్కాలికంగా పిండాన్ని బయటకు తీశారు. మళ్లీ నెలలు నిండిన తర్వాత ఆరోగ్యంగా జన్మించాడు. ఆ బాబుకి రాఫెర్టీ ఇసాక్( Rafferty Isaac ) అని పేరు పెట్టారు. ఇటీవల లూసీ, ఆమె భర్త కలిసి జాన్ రాడ్‌క్లిప్ హాస్పిటల్‌కు వెళ్లారు. తమ పండంటి బిడ్డతో డాక్టర్ సోలేమాని మజ్ద్‌ను కలిసి థ్యాంక్స్ చెప్పారు. ఆ బిడ్డతో తనకు ఏదో తెలియని అనుబంధం ఏర్పడిందని డాక్టర్ మజ్ద్ భావోద్వేగానికి లోనయ్యారు.