Site icon vidhaatha

న్యూజిలాండ్ పై భార‌త్ భారీ విజ‌యం

విధాత‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భార‌త జ‌ట్టు 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు సాధించగా, కివీస్‌ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 276 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కాగా టెస్ట్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సాధించాడు.

Exit mobile version