క‌రోనా కొత్త వేరియంట్.. హై ఆలర్ట్‌ ప్రకటించిన కేంద్రం

విధాత‌: భార‌త్‌లో క‌రోనా కొత్త వేరియంట్‌పై హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించింది భార‌త ప్ర‌భుత్వం. ద‌క్షిణాఫ్రికా కొత్త వేరియంట్ బి.1.1.529గా పిలుస్తున్నారు. రాష్ట్రాల‌న్నీ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య‌ శాఖ సెక్ర‌ట‌రీ లేఖ రాసింది. అత్యంత భయంకరంగా, ఇదివరకు ఎన్నడూ లేనంత తీవ్రంగా మ్యుటేట్ అయిన వేరియంట్ ఇదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటివరకు కనిపించిన వేరియంట్ల కన్నా ఇది భిన్నమైనదని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ తులియో డి ఒలివెరా చెప్పారు. కాగా, […]

  • Publish Date - November 26, 2021 / 03:25 AM IST

విధాత‌: భార‌త్‌లో క‌రోనా కొత్త వేరియంట్‌పై హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించింది భార‌త ప్ర‌భుత్వం. ద‌క్షిణాఫ్రికా కొత్త వేరియంట్ బి.1.1.529గా పిలుస్తున్నారు. రాష్ట్రాల‌న్నీ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య‌ శాఖ సెక్ర‌ట‌రీ లేఖ రాసింది.

అత్యంత భయంకరంగా, ఇదివరకు ఎన్నడూ లేనంత తీవ్రంగా మ్యుటేట్ అయిన వేరియంట్ ఇదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటివరకు కనిపించిన వేరియంట్ల కన్నా ఇది భిన్నమైనదని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ తులియో డి ఒలివెరా చెప్పారు.

కాగా, దీని వ్యాప్తి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని దక్షిణాఫ్రికాలోని ఒక ప్రాంతంలో మాత్రమే కేసులు బయటపడ్డాయని ఇది మరింతగా వ్యాప్తి చెంది ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా, త్వరగా వ్యాపించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి.

అంతే కాకుండా, ఇది రోగనిరోధక వ్యవస్థలో ఇతర భాగాలపై కూడా దాడి చేయవచ్చు. అయితే, గతంలో కూడా ఇంతలా భయపట్టే వేరియంట్లు బయటపడ్డాయి. కానీ, అవి వాస్తవంలో పెద్దగా ప్రభావం చూపలేదు.