సముద్రతీరపు గాలి, అలల పలకరింపుల మధ్య ఒక ఇల్లు… అది చాలామంది కల. కానీ ఆ కలను సాకారం చేసుకున్న వ్యక్తి, దాని అల్పాయుష్షును కూడా సాహసంగా స్వీకరించాడు. అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రం, కేప్ కాడ్ తీరంలో నివసించాలనే కోరికతో, డేవిడ్ మూట్ అనే 59 ఏళ్ల వ్యక్తి ₹3 కోట్లకు పైగా (అంటే సుమారు $395,000) విలువచేసే ఓ తీరాన ఒక ట్రిపుల్ బెడ్రూమ్ఇల్లు కొన్నారు. ఆశ్చర్యకరంగా కనిపించే ఈ ధర వెనుక ఒక కఠోర వాస్తవం ఉంది – ఈ ఇల్లు సముద్రంలోకి క్రమంగాజారిపోతున్న ఇసుకలో ఉంది. ఇంటి ముందు డెక్కు కేవలం 25 అడుగుల దూరంలోనే సముద్రపు నీటితో కోతకు గురవుతున్న ఇసుకమేటలున్నాయి. ప్రతియేటా సముద్ర అలలు మూడు అడుగులముందుకు జరిగే ప్రమాదం ఉన్నా, పదేళ్లకు మించి ఆ ఇల్లు బతకదని తెలిసి కూడా, డేవిడ్ ఈ ఇంటిని కొనుగోలు చేయడం వెనుక ఉన్న తాత్వికత అతని మాటలలో ప్రతిబింబిస్తుంది.
“జీవితం చాలా చిన్నది. చూద్దాం.. ఏం జరుగుతుందో..అని నాకు నేను చెప్పుకున్నాను. ఇల్లు చివరికి సముద్రంలోకి కలిసిపోతుందని ఆయనకు తెలిసినప్పటికీ, అది తన జీవితకాలంలో జరుగుతుందో, లేదో అనే భావనదేవిడ్ను నిర్భయంగా ముందుకు నడిపించింది. ఇది తాత్కాలికమనే నిజాన్ని తెలుసుకొని కూడాను, తీరాన జీవించాలనే కలను తాత్కాలిక జీవితానికి విలువనిస్తూ కొనుగోలు చేశారు.ఇప్పుడు దాని జీవితాన్ని పెంచే ప్రయత్నిం దిశగా నిపుణులను సంప్రదిస్తున్నాడు.
ఈ ఇంటిని 2022లో $1.195 మిలియన్‌కు (సుమారు ₹10 కోట్లు) మార్కెట్‌కి తీసుకువచ్చారు. కానీ గ్లోబల్ వార్మింగ్, తీరభాగాల కోత వంటి సమస్యల వల్ల,ఇల్లు కూలిపోతుందనే కారణంతో ధర గణనీయంగా పడిపోయింది. నాంటకెట్‌లో ఉన్న మరో తీర ఇల్లు కూడా, ఒకప్పుడు ₹16 కోట్లకు పైగా విలువ ఉన్నదైను, కేవలం ₹1.6 కోట్లకే అమ్మకానికి వచ్చింది.డేవిడ్కు పదికోట్లు పెట్టి ఇల్లు కొనే శక్తి లేదు. కానీ, అలాంటి ఇంట్లో నివసించాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. కూలిపోనుందనే కారణంతో 3 కోట్లకు పడిపోయిన ఆ ఇల్లు తనకు అందుబాలు ధరకు చేరుకోవడంతో డేవిడ్ ఆనందంతో కొనుక్కున్నాడు. నీకేమైనా పిచ్చా? అంటే.. నువ్వు వందేళ్లు బతుకుతావా? అని ఎదురుప్రశ్నిస్తున్నాడు. బతికినంత కాలం ఆనందంగా బతకడమే కదా ఎవరికైనా కావాల్సింది అని ప్రబోధిస్తున్నాడు.
ఈ కథనం మనకు ఒక్క విషయాన్ని నేర్పుతుంది — శాశ్వతత్వం ఒక భ్రమ. మనం కొనుగోలు చేసే ఇంటి గడువు, మన జీవితం కన్నా చిన్నదై ఉండొచ్చు. కానీ తీరానికి, సముద్రానికి, స్వేచ్ఛకు మనసు పడినవారు శాశ్వతత్వానికి ఆశపడరు. వారు ఒక్కసారైనా జీవితాన్ని కోరుకున్న విధంగా అనుభవించాలనుకుంటారు. డేవిడ్ మూట్నిర్ణయం, ఆర్ధికపరంగా సరైనదేమో తెలియదు. కానీ ఆ ఎంపిక వెనుక ఉన్న తత్వవిచారణ – “నిజమైన జీవితాన్ని అనుభవించాలంటే భవిష్యత్కు భయపడకూడదు” అనే సందేశాన్నిమాత్రం మనకు అందిస్తోంది.