Manika Vishwakarma : మిస్ యూనివర్స్ లో ఆ డ్రెస్.. ఫేమస్!

మిస్ యూనివర్స్‌లో భారత ప్రతినిధి మాణిక విశ్వకర్మ ధరించిన బీహార్‌ ప్రేరణ దుస్తులకు ప్రపంచ ప్రేక్షకుల నుంచి భారీ ప్రశంసలు లభిస్తున్నాయి.

Manika Vishwakarma

విధాత : మిస్ యూనివర్స్ పోటీలో మన దేశానికి అందాల కిరీటం దక్కకపోయినా..భారతీయ దుస్తుల ఔన్నత్యానికి ప్రేక్షకుల ఆదరణ కిరీటం దక్కడం మాత్రం దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. థాయిలాండ్ వేదికగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరుపున మిస్ యూనివర్స్ ఇండియా మాణిక విశ్వకర్మ పోటీ పడింది. ఈ పోటీలలో మెక్సికన్ మహిళ ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ కిరీటం ఎగరేసుకపోయిన సంగతి తెలిసిందే. ఈ పోటీలో మిస్ యూనివర్స్ ఇండియా మాణిక విశ్వకర్మ టాప్‌ 12 నుంచిఎలిమినేట్‌ అయింది.

అయితే మాణిక విశ్వకర్మ పోటీల్లో బెస్ట్ ఇన్ పర్సనల్ ఇంటర్వ్యూ, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డులను అందుకుంది. బెస్ట్ ఇన్ స్పీచ్ విభాగంలో టాప్ 5లో కూడా ఆమెకు స్థానం దక్కింది. ఇవన్ని పక్కన బెడితే పోటీలో ఆమె ధరించిన ఓ డ్రెస్ భారతీ చారిత్రాక, సంస్కృతిక వైభవాన్ని, ప్రాచీన దుస్తుల డిజైన్ గొప్పతనాన్ని చాటుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు కారణమైన ఆమె ధరించిన దుస్తుల డిజైన్ బీహార్ లోని మహాబోధి ఆలయం, బుద్ధుని జ్ఞానోదయం నుండి ప్రేరణ పొందాయి. ఆ దుస్తులకు లభించిన ఆదరణ..బీహార్ కు గర్వకారణమైన క్షణం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న మణిక క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. జాతీయస్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా తన ప్రతిభను చాటుకుంది.

ఇవి కూడా చదవండి :

China New Year Celebrations : చైనీస్ రివర్ డ్రాగన్ చూశారా…రాత్రివేళ జిగేల్
ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్

Latest News