విధాత : డ్రాగన్ వంటి భయంకర జంతువు నదిలో వెలుగులు విరజిమ్ముతూ దూసుకెలుతుండటం చూస్తే..అద్బుతంతో పాటు విస్మయం కూడా కలుగుతుంది. అలాంటి దృశ్యమే చైనాలోని నదిలో సాక్షాత్కరించింది. అచ్చం నిజమైన డ్రాగన్ ను తలపించేలా..డజన్ల కొద్దీ ఎల్ఈడీ లైట్లతో కూడిన పడవలు డ్రాగన్ నిర్మాణంలో అమర్చబడి, రాత్రిపూట నదిలో పాము మాదిరిగా మలుపులు తిరుగుతూ అమర్చబడి ఉన్నట్లు చిత్రీకరించబడింది. అద్బుతమైన ఈ రివర్ డ్రాగన్ షో చైనా నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా జాంగ్‌జౌలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం చైనా అంతగా నూతన సంవత్సర వేడుకల సందడి మొదలైంది. జాంగ్‌జౌ, గ్వాంగ్జీ, అన్హుయ్ ప్రావిన్సులలో డ్రాగన్ షోలు, ఇతర ప్రదర్శనలు జోరుగా సాగుతున్నాయి.
నిజానికి డ్రాగన్ ఓ భయాంకర రాక్షస బల్లుల జాతి జంతువు. చారిత్రాక, పురాణ కథనాల మేరకు డ్రాగన్‌లకు రెక్కలు, ముళ్లు, పొడవైన భారీతోక ఉంటాయి. అవి అగ్నిజ్వాలలు కక్కుతుంటాయి. నీటిలో, నేలపైన, ఆకాశంలో ప్రయాణించగలవని నమ్ముతారు. అయితే భూటాన్, వేల్స్, చైనా వంటి దేశాలకు డ్రాగన్ పవిత్రమైన పురాణ దైవ ప్రతీక. భూటాన్, వేల్స్ దేశాల జెండాలపై డ్రాగన్ చిత్ర పటం ఉంటుంది. చైనా, వియత్నంలకు డ్రాగన్ పూజనీయమైనది. చైనా ప్రజలు డ్రాగన్ ను జల దేవతలుగా, శక్తిని, అదృష్టాన్ని, సంపద, జ్ఞానం, శుభాన్ని, సార్వభౌమాధికారం తెచ్చేవిగా విశ్వసిస్తారు. అందుకే చైనా నూతన సంవత్సర వేడుకల్లో డ్రాగన్ నృత్యాలు, ప్రదర్శనలు ప్రముఖంగా ఉంటాయి. డ్రాగన్ లేజర్ షోలు, ఎయిర్ షోలు చూడటానికి రెండు కళ్లు చాలవు.
River dragonpic.twitter.com/ySz8NP2eFX
— Cosmic Gaia (@CosmicGaiaX) December 6, 2025
ఇవి కూడా చదవండి :
ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్
Tirupati : తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
