Tirupati : తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం

తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినిని గర్భవతి చేశాడు. మరో ప్రొఫెసర్ వారి దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Tirupati National Sanskrit university

అమరావతి : తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల కీచక పర్వం కలకలం రేపింది. చదువు చెప్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కామాంధుడిగా మారి విద్యార్ధినిని గర్బవతి చేశాడు. వారి వ్యవహారాన్ని వీడియో తీసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ దుర్మార్గం వెలుగు చూసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లోబరుచుకుని అమెను గర్బవతి చేశాడు. విద్యార్థిని, ప్రొఫెసర్ సన్నిహితంగా ఉన్న దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.శేఖర్ రెడ్డి రికార్డు చేశాడు. సెల్ ఫోన్ లో రికార్డు చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని విద్యార్థిని బెదిరించి లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బాధిత విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది.

అంతర్గత విచారణ జరిపిన అధికారులు ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈ ఘటనపై ఇన్‌ఛార్జీ వీసీ రజనీకాంత్ శుక్లా రుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులుఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లపైనా కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో బాధిత విద్యార్ధిని సంస్కృత యూనివర్సిటీ నుంచి సొంత రాష్ట్రం ఒరిస్సాకు వెళ్ళిపోయింది.

ఇవి కూడా చదవండి :

Praja Palana Vijayotsavam Celebrations : ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
Former IAS Pradeep Sharma : మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష

Latest News