విధాత: క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్’ సదస్సులో మోడీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియా టెక్నాలజీ: ఎవల్యూషన్ అండ్ రివల్యూషన్’’ అనే అంశంపై ప్రధాని కీలక ప్రసంగం చేశారు.