Saudi Arabia | ఇప్పటి నుంచి సౌదీ అరేబియా మహిళలు పురుషుల అనుమతితో నిమిత్తం లేకుండా తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చునని సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. యువరాజు సల్మాన్ 2018లో సబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో కూడా ఇదే విషయం చెప్పారు. ‘షరియా నియమాలు స్పష్టంగా, విపులంగా ఉన్నాయి. పురుషుల్లాగే మహిళలు గౌరవప్రదమైన ధరించవచ్చు. అవి నల్లని పైవస్త్రాలా? లేక తలపై కప్పుకొనే వస్త్రాలా అన్న స్పష్టత ఇవ్వలేదు. హుందాగా, గౌరవప్రదంగా ఉండే దుస్తులు ఎంపిక చేసుకునే నిర్ణయం మహిళలదే’ అని సల్మాన్ చెప్పారు.
అయితే సల్మాన్ ఈ ప్రకటన కొత్తగా చేసింది కాదని, పాత ప్రకటననే ఇప్పుడు మళ్లీ ప్రచారంలోకి తెచ్చారని ఒక వార్తా సంస్థ తెలిపింది. వస్త్రధారణకు సంబంధించి 1980 నుంచి మతపెద్దలు ఇచ్చిన ఆంక్షలు అలాగే ఉన్నాయని ఆ వార్తా సంస్థ తెలిపింది. అయితే 2015లో అరేబియా రాజు మహిళలు తప్పనిసరిగా బురఖా ధరించాలనే నిబంధనను ఎత్తేశారు. 2019లో మహిళలు కార్లు నడపడానికి అనుమతించారు. రంగురంగుల దుస్తులు ధరించానికి కూడా అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని రకాల దుస్తులపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆ వార్తా సంస్థ తెలిపింది.