Tooth Regrowth : డెంటల్ ట్రీట్మెంట్ లో విప్లవాత్మక మార్పు!

డెంటల్ ట్రీట్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పు తీసుకురానున్న బయో యాక్టివ్ ప్యాచ్ విధానాన్ని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ ప్యాచ్ దవడలోని స్టెమ్ సెల్స్‌ను చురుకుగా మార్చి, ఊడిపోయిన దంతాల స్థానంలో కృత్రిమ దంతాలకు బదులుగా సహజంగా కొత్త దంతాలు పెరిగేలా చేస్తుంది.

Tooth Regrowth

విధాత : ఊడిపోయిన దంతాల స్థానంలో కృత్రిమ దంతాలు పెట్టుకోకుండా.. కొత్త దంతాలను సహజంగా పెంచుకోవచ్చు అనే ఆలోచన వినడానికే ఆసక్తికరంగా ఉంది కదా? త్వరలోనే ఇది నిజం కాబోతుంది. వైద్య శాస్త్రంలో వస్తున్న నూతన పరిశోధనలు..ఆవిష్కరణలు మనవాళి ఎదుర్కొంటున్న అనేక వ్యాధులకు సరికొత్తగా చికిత్స పద్దతులను అందిస్తున్నాయి. తాజాగా డెంటల్ ట్రీట్మెంట్ లో రానున్న ఓ సరికొత్త చికిత్స విధానం ఆసక్తి రేపుతుంది. ఊడిపోయిన దంతాల స్థానంలో కృత్రిమ దంతాలను అమర్చడం ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన బయో యాక్టివ్ ప్యాచ్ ఇప్పుడు దంతాల చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పుగా అభివర్ణించవచ్చు. బయో యాక్టివ్ ప్యాచ్ విధానంలో ఊడిపోయిన దంతాల స్థానంలో కృత్రిమ దంతాలకు బదులుగా..దవడలోని స్టెమ్ సెల్ లను చరుకుగా మార్చి..పూర్తిగా కొత్త దంత నిర్మాణం సహజంగా పెరిగేలా చేస్తుంది.

ఊడిపోయిన దంతం స్థానంలో బయో యాక్టివ్ ప్యాచ్ అమర్చితే చిగుళ్ల లోపలి నుంచి కొత్త దంతం వస్తుంది. ఈ బయో యాక్టివ్ ప్యాచ్ విధానం ప్రస్తుతం మనుషుల్లో క్లినికల్ దశలో ఉందని..ఇది విజయవంతమైతే ఎంతోమంది దంత సమస్యల పీడితులకు ప్రయోజనకరం అవుతుందని తెలిపారు. జపాన్‌కు చెందిన స్టార్టప్, టోరెగెమ్ బయోఫార్మా సంస్థ కూడా స్టెమ్ సెల్(పునరుత్పత్తి డెంటల్ మెడిసిన్ ) విధానంపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తుందని సమాచారం.

Latest News