విధాత: అఫ్రికా దక్షిణ దేశాలు మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ప్రకృతి సాగించిన విలయతాండవానికి వందలాది మంది వరదల్లో గల్లంతయ్యారు. భారీ వర్షాలకు వెయ్యికి పైగా ఇల్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయినట్లు సమాచారం. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇప్పటివరకు మొజాంబిక్‌లో 103 మందికి పైగా మరణించారు. జింబాబ్వేలో 70 మందికి పైగా మృతి చెందారు. దక్షిణ ఆఫ్రికాలో మృతుల సంఖ్య 30 చేరింది. మృతుల సంఖ్య పెరగవచ్చు అని అధికారులు చెబుతున్నారు. మొజాంబిక్‌లో 2 లక్షల మందికి పైగా వరదలతో నష్టపోయారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. సైనిక హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పాఠశాలలు, రోడ్లు, బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి. వాటి పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నప్పటికి మరిన్ని భారీ వర్షాలు పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటకంగా మారాయి.
