పాక్ నటిని పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్‌..సానియా మీర్జాతో బంధం తెగతెంపులు

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావెద్‌ను ఆయన పెళ్లి చేసుకున్నట్లుగా ఇన్‌స్ట్రా వేదికగా ప్రకటించారు

  • Publish Date - January 20, 2024 / 10:37 AM IST

విధాత : పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావెద్‌ను ఆయన పెళ్లి చేసుకున్నట్లుగా ఇన్‌స్ట్రా వేదికగా ప్రకటించారు. జంటగా మేము ఇలా అంటూ హార్ట్ ఏమోజీతో పెళ్లి దుస్తుల్లో ఉన్న తమ ఫోటోను షేర్ చేశాడు. గతంలో షోయబ్ మాలిక్-భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాతా వారికి 2018లో ఇజాహన్ అనే కుమారుడు జన్మించాడు. వారిద్దరూ కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. పరస్పరం వారి ఇన్‌స్ట్రా, ట్వీటర్‌ ఖాతాల నుండి తమ రిలేషన్ తెలిపే విధంగా ఉన్న పేర్లను, ఫోటోలను డిలీట్ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో వారిద్ధరూ విడాకులు తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇటీవల సానియా మీర్జా పరోక్షంగా తాము విడిపోతున్నామనే విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. ‘విడాకులు బాధాకరం’ అని ఆమె పేర్కోన్నారు.


తాజాగా నటి సనా జావెద్‌ను షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకోవడంతో ఇక సానియా-మాలిక్‌ల 14ఏండ్ల దాంపత్య జీవితం ముగిసింది. షోయబ్ మాలిక్ గతంలో సానియా మీర్జాను పెళ్లి చేసుకోకముందు అయేషా సిద్ధిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లుగా సమాచారం. ఆ తర్వాతా సానియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో విడాకుల తర్వాతా పాక్ నటి సనా జావెద్ ను పెళ్లాడాడు. మాలిక్‌-సనాలు ఇద్దరూ కొంత కాలంగా డేటింగ్‌లో ఉంటున్నారు. అటు సనా జావెద్‌కు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. గతంలో ఆమె సింగర్ ఉమైర్ జస్వాల్ ను 2020లో ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇటు భర్త మాలిక్‌కు దూరంగా ఉంటున్న సానియా మీర్జా పాకిస్తాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంటున్నారు.

Latest News