తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిత్యం వహిస్తూ “తెలంగాణ స్టాల్”
ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం
LONDAN : లండన్ లోని భారత హై కమీషన్ మరియు బారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా భారత 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిపిన ” ఇండియా డే వేడుకల్లో”, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది. భారత హై కమీష్ నర్ విక్రమ్ దొరై స్వామి ముందుగా జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. ముందుగా తెలంగాణ ప్రత్యేకతతో టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ ని
తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రారంభించారు.
యూకే నలుమూలల నుండి వేలాదిమంది మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా …
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, బాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, గత 10 సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాల సమాచారాన్ని స్టాల్ లో ప్రదర్శించి, హజారయ్యిన వారందరికీ తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. “తెలంగాణా స్టాల్” ని సందర్శించిన ఆతిథులందరికి మన “హైదరాబాద్ బిర్యానీ” రుచిచూపించామని ముఖ్య నాయకులు సురేష్ బుడగం తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ కార్యవర్గ సభ్యులు సత్య చిలుముల, వెంకట్ రెడ్డి, సురేష్ బుడగం, రవి రేతినేని, స్వాతి, రవి పులుసు, క్రాంతి రేతినేని తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.