విధాత: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో( USA road accident) తెలుగు దంపతులు దుర్మరణం(Telugu couple dies) చెందారు. ఏపీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాసులైన కొటికపూడి కృష్ణ కిషోర్(Krishna Kishore 45), ఆశ(Asha 40) వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (dies) మరణించారు. ప్రమాదంలో వారి కుమార్తె, కుమారుడికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణ కిషోర్ కొన్నేళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.
ఇటీవలే 10రోజుల క్రితం స్వస్థలం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకలకు హాజరయ్యారు. స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్లిన రోజుల వ్యవధిలోనే కృష్ణ కిషోర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురవ్వడం కుటుంబ సభ్యులు, బంధువర్గాల్లో తీవ్ర విషాదం రేపింది.
