అంగార‌కునిపై అద్భుత ప్ర‌దేశం.. వీడియో విడుద‌ల చేసిన ఈఎస్ఏ

  • Publish Date - October 16, 2023 / 07:41 AM IST

విధాత‌: అంగార‌కుని (Mars) పై ఉన్న వింత‌లు విశేషాల‌ను తెలుసుకునేందుకు ప‌లు దేశాల అంత‌రిక్ష సంస్థ‌లు అక్క‌డ‌కు ఉప‌గ్ర‌హాల‌ను పంపిన విష‌యం తెలిసిందే. మ‌న ఇస్రో మంగ‌ళ్‌యాన్‌ను ప్ర‌యోగించ‌గా.. నాసా ప‌ర్సెవ‌రెన్స్ రోవ‌ర్‌ను, యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మార్స్ ఎక్స్‌ప్రెస్ అనే ఉప‌గ్రహాన్ని ప్ర‌యోగించాయి. మార్స్ ఎక్స్‌ప్రెస్ (Mars Express) 2003లో అంగార‌కుని క‌క్ష్య‌లో ప్ర‌వేశించ‌గా.. అప్ప‌టి నుంచి దాని చుట్టూ ప‌రిభ్ర‌మిస్తూనే ఉంది.


ఈ క్ర‌మంలో అది కొన్ని ల‌క్ష‌ల మార్స్ ఫొటోల‌ను తీసి శాస్త్రవేత్త‌ల‌కు పంపింది. వాట‌న్నింటినీ క్రోడీక‌రించిన శాస్త్రవేత్త‌లు తాజాగా అంగార‌కుడిపై ఉన్న ఒక వింత ప్ర‌దేశాన్ని వీడియో రూపంలో విడుద‌ల చేశారు. నోక్టిస్ లాంబ్రింథ‌స్ లేదా లాబిరింథ్ ఆఫ్ నైట్ అని పిలిచే ఈ ప్రాంతం.. మార్స్ లో గ్రాండ్ కానియ‌న్ అని భావించే మార్షియ‌న్ వేల్స్ మెరైన‌రీస్ ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లో ఉంది. ఇది మ‌న సౌర ప్ర‌పంచంలోనే అతి పెద్ద అగ్ని ప‌ర్వ‌తం కావ‌డం విశేషం.

Latest News