Self Growing City On The Moon | చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించడంపై (self-growing city on the Moon) ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ (SpaceX) దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రయోగాలను ముమ్మరం చేసింది. పదేళ్లలో మూన్‌పై సిటీ నిర్మాణం పూర్తవుతుందని మస్క్ ప్రకటించారు. మస్క్ ప్రకటనతో చంద్రుడిపై జీవనం ఎలా ఉంటుందా..? అని అంతా ఊహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఏఐ వీడియో రూపొందించి నెట్టింట పోస్టు చేశారు. 2024 నాటికి చందమామపై ఇలా ఉంటుంది అంటూ ఆ నెటిజన్ పేర్కొన్నాడు.
ఇగ్లూ లాంటి నిర్మాణాలు, పిల్లలు ఆడుకోవడం, టెస్లా కార్లు, రోబోట్లు వంటి వాటితో ఈ వీడియోను రూపొందించారు. చందమామపై నగరం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను బిలియనీర్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా షేర్ చేశారు.
“చంద్రుడిపై సివిలైజేషన్” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసి, తన భవిష్యత్ ప్రణాళికలపై కొత్త చర్చకు తెరలేపారు.
మస్క్ ప్రకటన
అంగారకుడితో పోలిస్తే చంద్రుడిపై నగరాన్ని నిర్మించడం చాలా వేగంగా సాధ్యమవుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. “మార్స్‌కు ప్రయాణించాలంటే గ్రహాలు అనుకూలించాల్సి ఉంటుంది. అందుకు కొన్ని నెలలు ఆగాలి. ప్రయాణానికి కూడా దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. అదే చంద్రుడిపైకి పది రోజులకోసారి వెళ్లొచ్చు. కేవలం రెండంటే రెండే రోజుల్లో మూన్‌పైకి చేరుకోవచ్చు. మార్స్‌పై నగరాన్ని అభివృద్ధి చేయాలంటే 20 సంవత్సరాలకు పైనే పడుతుంది. అదే మూన్‌పై అయితే 10 ఏళ్ల కంటే తక్కువ సమయే పడుతుంది. అందుకే స్పేస్ ఎక్స్ ఇప్పటికే చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించడంపై దృష్టి పెట్టింది” అని మస్క్ పేర్కొన్నారు. అంతేకాదు రాబోయే 7 ఏళ్లలో మార్స్ నగరంపై కూడా పనులు ప్రారంభించనున్నట్లు మస్క్ తెలిపారు. కానీ, ప్రస్తుతానికి మాత్రం నాగరికత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై నగర నిర్మాణానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
Civilization on the Moon! https://t.co/b3zVA0dU8G
— Elon Musk (@elonmusk) February 9, 2026
ఇవి కూడా చదవండి :
Srisailam : శ్రీశైలంలో శివ భక్తుల గోస..గ్రామోత్సవం రద్దు!
Namrata | వెడ్డింగ్ యానివర్సరీ.. నమ్రత షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్‌కి అదిరిపోయే రెస్పాన్స్
