వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. నయా ఫీచర్‌ను పరిచయం చేసిన మెటా కంపెనీ..!

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెస్సేజ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు నయా ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేస్తున్నది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలోని కంపెనీ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది

  • Publish Date - November 16, 2023 / 10:31 AM IST

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెస్సేజ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు నయా ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేస్తున్నది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలోని కంపెనీ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు వాయిస్‌ ద్వారా చాట్‌ చేసుకునే వీలు కలుగనున్నది. డిస్కార్డ్‌ తరహాలో ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకువచ్చింది. అయితే, ఈ ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేస్తుందని WBINFO ఆగస్టులో తెలిపింది. తాజాగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను అధికారికంగా విడుదల చేసింది.


దాంతో యూజర్లు గ్రూప్‌లోని సభ్యులతో టెక్ట్స్‌ను టైప్‌ చేయకుండా కేవలం నేరుగా మాట్లాడుకునే వీలునున్నది. సాధారణంగా యూజర్లు ఎక్కువగా టైప్‌ చేయడానికి ఇష్టపడరు. మాట్లాడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే వాట్సాప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. వాయిస్‌ చాట్‌ సమయంలో ఎవరు ఎవరు ఉన్నారో సైతం చూసుకోవచ్చు. వారితో కలిసి జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్‌లోని వారంతా చాట్ నుంచి ఎగ్జిట్ అయితే.. ఆటోమేటిక్‌గానే వాయిస్ చాట్ ఆటోమేటిక్‌గా క్లోజ్‌ అవుతుంది.


ప్రస్తుతానికి ఈ ఫీచర్ ప్రైమరీ డివైజ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుండగా.. సెకంటరీ డివైజ్‌లో అందుబాటులో ఉండదు. వాయిస్‌ చాట్‌ సమయంలో గ్రూప్‌ సభ్యులకు కానీ.. ఏరో వ్యక్తులతో టెక్స్ట్‌ చాట్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నది. త్వరలోనే ఒకే ఫోన్‌ నంబర్‌తో ఒకే మొబైల్‌లో ప్రత్యామ్నాయ వాట్సాప్‌ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకునే వీలు కల్పించబోతున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉన్నది. వాట్సాప్‌ కాల్స్‌ సమయల ఐపీ అడ్రస్‌ హైడ్‌ చేసే అవకాశం కల్పిస్తుంది. దాంతో యూజర్లకు మరింత భద్రత దొరకనున్నది.

Latest News