Music Lollipop | లాలీపాప్స్ (Lollipop).. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ క్యాండీస్‌ను ఇష్టంగా తింటుంటారు. పెద్దలైతే వాటిని చప్పరిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటారు. అయితే, మనం ఇప్పటి వరకూ లాలీపాప్స్‌ను తినడం వరకే తెలుసు. కానీ, రుచిగా ఉండటం మాత్రమే కాకుండా సంగీతాన్ని వినిపించే లాలీపాప్ (Music Lollipop) గురించి ఎప్పుడైనా విన్నారా..? అలాంటి లాలీపాప్‌ని టెక్నాలజీ సాయంతో వినూత్నంగా ఆవిష్కరించారు.
ఈ మ్యూజిక్ లాలీపాప్‌ను లాస్‌వేగాస్‌లో నిర్వహించిన సీఈఎస్ 2026లో ప్రదర్శించారు. లాలీపాప్ స్టార్ (Lollipop Star) పేరుతో బోన్ కండక్షన్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారట. ఈ లాలీపాప్‌ను నాలుకతో నాకినా, పళ్లతో కొరికినా శబ్ద తరంగాలు పుర్రెలోని ఎముకల ద్వారా ప్రయాణించి, లోపలి చెవులకు చేరుతాయి (music comes out). ఆ ధ్వని సంగీతంలా వినిపిస్తుందట. ఈ లాలీపాప్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక ధర విషయానికొస్తే లాలీపాప్ స్టార్ వెబ్‌సైట్ ప్రకారం.. ఒక్కోలాలీపాప్ ధర 8.99 డాలర్లుగా ఉంది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. రూ.808 అన్నమాట. ఈ మ్యూజిక్ లాలీపాప్ ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఇటువంటి టెక్నాలజీని దాదాపు పాతికేళ్ల క్రితం టూత్‌బ్రష్‌లో కూడా వాడినట్లు గుర్తు చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Anasuya | శివాజీ వ్యాఖ్యల వివాదం నడుమ అనసూయ స్పందన… సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్
Samantha | సమంత మానియా.. టీజర్‌తో ప్రకంపనలు పుట్టించిందిగా..!
