White House | అమెరికా అధ్యక్ష భవనం దగ్గర కలకలం.. వైట్‌ హౌజ్‌ గేటును ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌ మృతి

White House | అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్ష భవనం 'వైట్‌ హౌజ్‌' దగ్గర కలకలం చెలరేగింది. వైట్‌ హౌజ్‌ గేటును ఒక కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించాడు. ఇంత భద్రత నడుమ కారు గేటు దాకా దూసుకొచ్చి ఢీకొట్టడంతో వైట్ హౌజ్‌ భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

White House : అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌ హౌజ్‌’ దగ్గర కలకలం చెలరేగింది. వైట్‌ హౌజ్‌ గేటును ఒక కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించాడు. ఇంత భద్రత నడుమ కారు గేటు దాకా దూసుకొచ్చి ఢీకొట్టడంతో వైట్ హౌజ్‌ భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పైగా ఈ ఏడాదిలో ఇదే తొలి ఘటన కాకపోవడం గమనార్హం. జనవరిలో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో అధ్యక్ష భవనం దగ్గర రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం భత్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. కాగా ఆదివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఓ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చిందని, వైట్‌ హౌజ్‌ కాంప్లెక్స్‌ బయట గేటును బలంగా ఢీకొట్టిందని శ్వేతసౌదం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రమాదంతో ఉలిక్కిపడిన భద్రతా సిబ్బంది వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో కారు డ్రైవర్‌ చికిత్సకు తరలించేలోపే అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ఉగ్ర కోణం ఏమైనా ఉందా అని భద్రత సిబ్బంది విచారణ చేపట్టారు. అయితే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని, ఇందులో కుట్రకోణాలు ఏమీ లేవని భద్రతా దళాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి.

స్థానిక పోలీసులతోపాటు దర్యాప్తు చేపట్టిన సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం ‘భద్రతపరంగా ఎలాంటి ముప్పు లేదు’ అని ప్రకటించింది. అయితే అధ్యక్ష భవనం సమీపంలో ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదాలపై అక్కడి భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శ్వేత సౌధం వద్ద భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాయి.

ప్రమాదం రూపేణ అసాంఘిక శక్తులు కూడా దాడిచేసే అవకాశం ఉండడంతో ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. కాగా ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌, మాజీ అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఫలితాలపరంగా చూస్తే ట్రంప్‌ ముందంజలో ఉన్నట్లు సమాచారం.