అమెరికా, టెక్సాస్లోని ఫానిన్(Fannin) కౌంటీలో నేడు జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు మరణించారు(Five dead). ఇందులో ముగ్గురు తెలుగువాళ్లు(Three are from AP) కూడా ఉన్నారు. ఇంకా ఒకరు తీవ్రగాయాలతో బయటపడగా, హెలీకాప్టర్లో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, బాన్హమ్,టెంటాన్ మధ్య స్టేట్ హైవే 121(SH 121) పై సాయంత్రం 5.55 ని.లకు ఈ ప్రమాదం జరిగింది. టెక్సాస్ ప్రజా రక్షణ విభాగం నో పాసింగ్ జోన్లోకి ఒక కారు చొచ్చుకువచ్చి, మరో కారును ఢీకొట్టడంతో రెండు కార్లలో మంటలు చెలరేగాయి.
మృతుల్లో ఇద్దరు ఒక కార్లో ఉండగా, వారినింకా గుర్తించాల్సిఉంది. మరో కార్లో ఉన్న ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా చనిపోయారు. వారిని గూడూరు(Guduru)కు చెందిన గోపి తిరుమూరు, శ్రీకాళహస్తి(Sri Kalahasti)కి చెందిన రాజినేని శివ, హరిత చెన్నుగా గుర్తించారు. హరిత భర్త సాయి చెన్ను తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.