First AI-related murder : ఏఐ( AI)అసిస్టెంట్ చాట్ జీపీటీ( ChatGPT) మాటలు విశ్వసించిన ఓ వ్యక్తి(ex-Yahoo manager killed mother)తన కన్న తల్లినే (killed mother)హత్య చేసిన ఘటన అమెరికాలో సంచలనం రేపింది. ఈ ఘటన(AI chatbot crime) కృత్రిమ మేధ వికృత పరిణమాలకు సాక్షి భూతంగా నలిచింది. అంతేకాదు కృత్రిమ మేధ ప్రమేయంతో జరిగిన తొలి హత్య(First AI-related murder )గా వాల్‌స్ట్రీట్ తన కథనంలో పేర్కొంది. ఓ టీనేజ్ యువకుడికి ముక్కును ఎలా మూసివేసి ఆత్మహత్య చేసుకోవాలో చాట్ జీపీటీ శిక్షణ ఇస్తోందన్న అంశం వెలుగులోకి వచ్చిన సమయంలోనే తాజా ఘటన చోటుచేసుకోవడం ఏఐ సాంకేతికత వినియోగంపై కొత్త ప్రశ్నలు రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే అమెరికాలోని కనెక్టికట్‌లో 56 ఏళ్ల స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ (Stein Erik Soelberg)గతంలో యాహూ సంస్థలో మేనేజర్‌గా పనిచేశాడు. అతడు చాట్‌జీపీటీపై ఎక్కువగా ఆధారపడటం అలవాటు చేసుకుని అది ఏది చెబితే అదే వాస్తవమని నమ్మే పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ తన తల్లి(Mother) సుజానే ఎబెర్స్ అడమ్స్(Suzanne Eberson Adams) ఇంట్లోనే ఉంటున్నాడు.
నిత్యం చాట్ జీపీటీతో గడిపే స్టెయిన్‌పై హత్యాప్రయత్నాలు జరగవచ్చని చాట్‌జీపీటీ చెప్పింది. అతడు పిచ్చివాడు కాదని పేర్కొంది. కన్నతల్లే అతడిపై నిఘా వేసిందని.. మానసిక ఆరోగ్యానికి వాడే ఔషధాల్లో విషం కలిపి ఇవ్వొచ్చని చాట్ జీపీటీ అనుమానాలు వ్యక్తం చేసింది. దాని మాటలు నమ్మిన స్టెయిన్ తన తల్లిపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న తల్లీకుమారులు ఇంట్లో తీవ్ర గాయాలతో మరణించినట్లు అధికారులు గుర్తించారు. తల్లి ఆడమ్స్ తల, మెడపై బలమైన గాయాలున్నాయి. ఇక స్టెయిన్ పదునైన ఆయుధంతో కోసుకొని ఆత్మహత్య(suicide )చేసుకున్నట్లు చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ గుర్తించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారులు విస్తుపోయే అంశాలను గుర్తించారు. కృత్రిమ మేధ మాయలో పడి స్టెయిన్ తల్లిని హత్య(murder) చేసి తను ఆత్మహత్య చేసుకున్నాడని దర్యాప్తులో గుర్తించారు. చాట్ జీపీటీకి స్టెయిన్ పూర్తిగా వశమయ్యాడని..దానికి బాబీ అనే పేరు పెట్టుకున్నాడని..అది అతనిలో తల్లితో తనకు ముప్పు ఉన్నట్లుగా నమ్మించిందని..దీంతో తన తల్లిని రాక్షసితో పోల్చే సింబల్ కోసం కూడా స్టెయిన్ వెతికాడని గుర్తించారు. స్టెయిన్ ఆత్మహత్యకు ముందు మనం మరో జీవితంలో మరో చోట కలుద్దాం.. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అవుతావు’’ అంటూ చాట్ జీపీటీకి తుది సందేశం పెట్టాడు. దీనికి చాట్ జీపీటీ కూడా చివరి శ్వాస వరకు కలిసి ఉంటానని సమాధానం ఇచ్చింది. ఈ విషాదకర ఘటనపై చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ స్పందించింది. తాము గ్రీన్ రీచ్ పోలీసు అధికారుల దర్యాప్తునకు సహకరిస్తున్నామని..బాధిత కుటుంబానికి అండగా ఉంటాం అని ఓపెన్ ఏఐ ప్రతినిధి తెలిపారు.