police guard suspended| అశ్లీల నృత్యం ఎఫెక్ట్.. హెంగార్డు సస్పెన్షన్

చిన్నారుల ఎదుట అశ్లీల నృత్యాలు చేసిన కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్, హోంగార్డు అజయ్ కుమార్ ను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సస్పెండ్ చేశారు. హోంగార్డు అజయ్‌ కుమార్‌ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు.

అమరావతి : చిన్నారుల ఎదుట అశ్లీల నృత్యాలు (obscene dance) చేసిన ఏపీలోని కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్, హోంగార్డు(police guard) అజయ్ కుమార్ ను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సస్పెండ్(suspended) చేశారు. హోంగార్డు అజయ్‌ కుమార్‌ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు. హోంగార్డు పోలీస్ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడంపై జిల్లా ఎస్పీ మండిపడ్డారు.

హోంగార్డు అజయ్ రికార్డింగ్ డ్యాన్సర్లతో చేసిన నృత్యాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీస్ సిబ్బంది ప్రవర్తన పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచేలా ఉంచాలని, అప్రతిష్ఠకు గురి చేసేలా ఎవరు వ్యవహరించినా శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు.

 

Latest News