విధాత :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ సర్కార్ శుభవార్త తెలిపింది. 8వ పే కమిషన్ కే కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. దీంతో కోటీ పదిహేను లక్షల మది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పింఛన్లు పెరిగనున్నాయి. దీనికి వీలుగా కేంద్ర క్యాబినెట్ 8వ వేతన కమిషన్ ను మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ఈ పే కమిషనకు చైర్ పర్సన్ గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ వ్యవహరించనున్నారు. అలాగే కమిషన్ లో ఇద్దరు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ప్రస్తుత ఉన్న వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పే కమిషన్ గడువు ముగిసిన తరువాత కొత్త వేతన సవరణ చట్టాన్ని అమలు చేయనుంది.
దీనికి వీలుగా 8వ వేతన సవరణ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు కేంద్ర మంత్రులతో పాటు మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపిన తరువాత కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ లో చైర్ పర్సన్ తో పాటు ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలోమ పేర్కొంది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారుల వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో పే కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న జీతాలు, పెన్షన్లు ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణను చేపడుతుంది.
